అమ్మ కొడితే ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు.. కానీ చివరికి?

praveen
నేటి రోజుల్లో సోషల్ మీడియా అనేది మనిషికి ఎంతలా అలవాటుగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని పనులు ఉన్నా సరే ప్రతిరోజు గంటల పాటు సోషల్ మీడియా అనే మాయలో మునిగితేలుతూ ఉన్నాడు మనిషి. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో ఎప్పుడు ఎన్నో రకాల వీడియోలు తెరమిదికి  వస్తూ ఉంటాయి. ఎంతోమంది సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిత్రవిచిత్రమైన వీడియోలు చేస్తూ తమలోని క్రియేటివిటీని చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలాంటి వీడియోలు కొన్ని అందరిని తెగ నవ్విస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి చక్కర్లు కొడుతుంది.

 ఈ మధ్యకాలంలో ఎవరైనా మీపై అటాక్ చేస్తే.. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో అని చూపిస్తూ ఎంతో మంది వీడియోలను చేస్తూ సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే చేశాడు. ఇంట్లో తల్లి కొడితే ఎలా ఆమె నుంచి తప్పించుకోవాలి అని ట్రైనింగ్ సెషన్ నిర్వహించాడు. ఇదంతా వీడియో తీశాడు. కానీ ఇదంతా చేస్తున్న అతనికి ఊహించని రీతిలో షాక్ తగిలింది. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరూ అందరూ కూడా ఒక్కసారిగా తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి.

 సాధారణంగా ప్రతి ఇంట్లో పిల్లలను తల్లి కొట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా తల్లి కొడుతున్న సమయంలో ఆమె నుంచి ఎలా రక్షించుకోవాలి ఒక వ్యక్తి ఇతరులకు శిక్షణ ఇస్తున్నాడు ఓ యువకుడు. ఈ క్రమంలోనే  మరో వ్యక్తి ట్రైనర్ చెప్పిన తీరుకు ఎదురుగా తల్లి గెటప్ లో ఉండి యాక్టింగ్ చేస్తున్నాడు. అయితే ఇద్దరు యువకులు ఇలా ట్రైనింగ్ సెషన్  నిర్వహిస్తున్న సమయంలో.. అతని తల్లి నిజంగానే అక్కడికి వచ్చింది. ఏకంగా ఒక్కసారిగా చెప్పుతో కొడితే ఎలా తప్పించుకోవాలో నేర్పించిన వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోతాడు. ఇది చూసి అందరూ నవ్వుకుంటున్నారు. తల్లి నుంచి ఎవరు తప్పించుకోలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: