వైరల్: పరారీలో నిత్యానంద.. ఆయన సీక్రెట్స్ బయట పెట్టిన మహిళ..!

Divya
ఇండియాలో ఎక్కువగా స్వామీజీలు పుట్టగొడుగుల పుట్టుకొస్తూ ఉంటారు... అలా ఇప్పటికే ఎంతో మంది దొంగ స్వామీజీలు ఉన్నట్లుగా చాలామంది కనుక్కోవడం జరిగింది.. ఇండియాలో ప్రస్తుతం పరారీలో ఉన్న నిత్యానంద తన సోషల్ మీడియా హ్యాండిల్ లో.. మహా పూర్ణిమ అంటే జూలై 21న వస్తుందని తన రహస్య ప్రపంచం నుండి తెరను తొలగిస్తానంటూ కూడా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఆరోజు టైం స్క్వేర్ లో ఒక చిన్న క్లిప్ ద్వారా కూడా కైలాస్ స్థానాన్ని వెల్లడిస్తానంటూ కూడా తెలియజేశారు.

దీని తర్వాత నిత్యానంద అనేక చీకటి దోపిడీలను గురించి పలు రకాల వాటిని బహిర్గతం చేసేందుకు అతని అనుచరులు సైతం కొంతమంది ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పరారీలో ఉన్న నిత్యానంద మాజీ శిష్యురాలు అయిన సారాలాండ్రి ప్రస్తుతం కెనడాలో ఉన్నట్లుగా సమాచారం.. 2009లో నిత్యానంద ఆశ్రమంలో చేరారని తాను సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలనుకున్నానని.. అందుకే యోగ మెడిటేషన్ వంటి కోర్సులను నేర్చుకోగలిగానని తెలిపింది. 2010లో నిత్యానంద ఎంఎంఎస్ లీక్ అయినప్పుడు ఆమె ఈ వీడియోని మార్ఫింగ్ వీడియో అంటూ తెలియజేసింది.

మతపరమైన పాఠాలు చెప్పేందుకు ఆయన సొంతంగా సమస్తలను నిర్వహించడం లేదని కూడా వెల్లడించింది. అంతేకాకుండా ఆయన మాఫియాల పనిచేస్తున్నారని సార వెల్లడించింది. 9 ఏళ్ల పాటు నిత్యానంద సూచనల మేరకే తన జీవితం ముందుకు సాగింది అంటూ వెల్లడించింది.తాను 24 ఏళ్లలో చేరగా 33 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నానని తెలియజేసింది. ఆశ్రమం నుంచి బయటికి వచ్చేటప్పుడు తన పైన తప్పుడు ఆరోపణలు చేసి తనను ఇరికించారని కూడా తెలిపింది. ముఖ్యంగా తను హిందువు కాదని పిల్లలని కొట్టుతూ ఉన్నానని ఆరోపణలు వినిపించాయి..

కానీ కొంతమందితో మాట్లాడి అక్కడ తెలుసుకున్న విషయం ఏమిటంటే పిల్లలను చంపడం మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లుగా తనకు తెలిసిందనీ.. చాలామంది మహిళలను సన్యాసులుగా మార్చేలా అక్కడ ప్రభావం చేస్తారని తెలిపింది.. కైలాష్ గురించి చెబుతూ.. అది ఒక నకిలీ కథ అని ఒక తప్పుడు దేశమని అది తాను సృష్టించినది అంటూ వెల్లడించింది. ఈ విషయంపై నిత్యానంద పై ఫిర్యాదు చేసిన పోలీసులు తనపై ఎఫ్ఐఆర్ చేయలేదని తెలిపింది. ముఖ్యంగా నిత్యానంద పైన చర్యలు విచారణ చాలా ముఖ్యమని.. చాలామందిని వేధించి అత్యాచారాలు కూడా చేశారని దీనివల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయ్యాయని తెలిపింది. అతని శిక్షించాలి అంటూ ఆమె అభ్యర్థిస్తున్నాను అంటూ తెలిపింది. నిత్యానంద నేరం కళ చాలా పెద్దదని.. అతడి నేరాలకు సాక్షిని నేనే అని ఇప్పుడు న్యాయవ్యవస్థ పైన తనకు నమ్మకం పోయింది అంటూ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: