వైరల్: ఏంటి తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదా..!
దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. తిరుమలలో ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే శ్రీ మహావిష్ణువును అలంకార ప్రియుడు అని పిలుస్తూ ఉండడం జరుగుతుంది. పురాణాలలో తిరుమలను పూల మంటపం అని కూడా పిలిచేవారట. తిరుమల పూల మంటపం కావడం చేత శ్రీవారికి కూడా పూల అలంకరణలు అంటే చాలా ఇష్టం ఉండడం చేత స్వామి వారికి నిత్యం టన్నుల కొద్ది పూలతో అలంకరించి మరి పూజలు చేస్తూ ఉండేవారని తెలుస్తోంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని వందలాది పూల అలంకారాలతో వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజించేవారు. తిరుమలలో పూసే ప్రతి పుష్పం కూడా వెంకన్న స్వామికి అంకితం అని ప్రజలకు భక్తులు సైతం ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు పూలను సైతం తాకకూడదని నిబంధనలు కూడా అమలులోకి తీసుకురావడం జరిగిందట .ఈ కారణం చేత స్వామివారి దర్శనానికి వచ్చే మహిళలు సైతం తలలో ఎవరూ కూడా పూలు ధరించరట.. ఇది వినడానికే కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తున్నది.