పాకిస్తాన్లో రూ. 117 కే హోటల్ గది.. ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే?
అయితే ఇలా చుట్టుపక్కల ఉన్న సుందరమైన ప్రాంతాలను మాత్రమే కాదు హోటల్లో స్టేట్ చేసే సమయంలో ఇక రూమ్ ఎలా ఉంది .. తన దగ్గర నుంచి ఎంతవరకు రెంట్ వసూలు చేశారు అన్న విషయాన్ని కూడా వ్లాగ్ చేసి చూపించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని దేశాలలో ఏకంగా ఒక్కరోజు బస కోసం తీసుకునే రెంట్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్లో ఒక వ్లాగర్ రూమ్ రెంటుకు తీసుకున్నాడు. అక్కడ రెంట్ ఎంత అన్న విషయం చెప్పడంతో ఇక సోషల్ మీడియా జనాలు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. అదేంటి పాకిస్తాన్లో కూడా అంత ఎక్కువ రెంట్ తీసుకుంటున్నారా అంటారా.
ఎక్కువ కాదు చాలా తక్కువ.. టామ్ అనే వ్లాగర్ ఎప్పుడు ఏదో ఒక దేశాన్ని చుడుతూ అక్కడ దాగున్న విశేషాలను వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇకపోతే ఇటీవల పాకిస్తాన్ కి వెళ్ళాడు. అక్కడ షెఫర్డ్ లోని హోటల్ రూమ్స్ ధరలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ ప్రాంతంలో హోటల్ గది కేవలం 117 రూపాయలకు మాత్రమే రెంటుకు దొరుకుతుంది. ఏంటి ఇంత చీపా ఈ ధరకు సరైన సౌకర్యాలు కూడా ఉండవు కదా అనుకుంటూ డౌట్ పడ్డాడు. ఇలా డౌట్ తోనే రూమ్ లోపలికి వెళ్ళాడు. అయితే అందులో రెండు చిన్న బెడ్లు ఒక చిన్న టీవీ లాంటి సౌకర్యాలు చూసి ఆశ్చర్యల్లో మునిగిపోయాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.