వీడియో: చెప్పులు కొట్టేసిన పాము.. దీనికి ఏమి అవసరం వచ్చిందో..?

frame వీడియో: చెప్పులు కొట్టేసిన పాము.. దీనికి ఏమి అవసరం వచ్చిందో..?

praveen

సోషల్ మీడియాలో ఒక వింత వీడియో చాలా వైరల్ అవుతుంది. అందులో ఒక పాము ఒక చెప్పును తస్కరించి దొంగలాగా పారిపోతుంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో, పాము చాలా తెలివిగా తన చుట్టూ ఉన్న వస్తువుల మధ్య నుంచి వెళుతూ ఉంటుంది. అప్పుడు దానికి దగ్గరలో పడి ఉన్న ఒక చెప్పు కనిపిస్తుంది. అది ఎందుకో ఆ చెప్పు మీద ఆసక్తి చూపిస్తుంది. ఆ తర్వాత ఆ చెప్పును పట్టుకొని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది.
ఆ వీడియోలో మొదట్లో ఆ చెప్పు పాము కంటే చాలా పెద్దగా, బరువుగా కనిపించింది. కానీ ఆ పాము చాలా తెలివిగా తన నోటితో చెప్పును పట్టుకొని దానిని పైకి ఎత్తుకొని పారిపోతుంది. అది చూసిన వాళ్లంతా నవ్వుకున్నారు. వీడియోలో ఒక ఆంటీ "అది చెప్పుతో పారిపోయింది" అని నవ్వుతూ చెప్తుంది. ఆ పాము చెప్పుతో పారిపోయి పొదల్లో దాక్కొంది.
ఈ వీడియోను ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ 'X'లో షేర్ చేస్తూ "చెప్పు దొంగ పాము" అని రాసి రాశారు. ఇది ఆగస్టు 11న మధ్యాహ్నం 3:06 గంటలకు పోస్ట్‌ చేశారు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి., 1,100 మంది లైక్ చేశారు. దీన్ని 338 మంది తమ అకౌంట్లో రీషేర్ చేశారు. చాలామంది ఈ వీడియో మీద కామెంట్లు చేశారు. కొంతమంది నవ్వుతూ ఫన్నీ కామెంట్లు చేశారు. ఒకరు, "పాము కోర చెప్పులో చిక్కుకుపోయి ఉంటుంది. ఎవరూ ఆ చెప్పు తీసివేయకపోతే పాము చచ్చిపోతుంది" అని కామెంట్ చేశారు.
ఈ వీడియో చూసిన చాలామంది పాము ఎందుకు ఆ చెప్పును తీసుకెళ్ళింది, ఆ చెప్పు ఎలాంటి వాసన వచ్చి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ఈ వీడియో మనల్ని నవ్వించడమే కాకుండా, చాలా చర్చలకు దారితీసింది. ఇవిచిత్రమైన వీడియోను చూడాలనుకుంటే ఈ https://x.com/DineshKumarLive/status/1822567723840213055?t=rb2RxDkR1XIw7n42uK950A&s=19 లింకు మీద క్లిక్ చేయవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: