వీడియో: ట్రైన్‌లో గొడవ.. మీద ఉమ్ము వేసిన మహిళ.. పట్టుకొని కొట్టిన వ్యక్తి..

frame వీడియో: ట్రైన్‌లో గొడవ.. మీద ఉమ్ము వేసిన మహిళ.. పట్టుకొని కొట్టిన వ్యక్తి..

praveen

ఇటీవల కాలంలో ట్రైన్లలో రద్దీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన వీడియో లు కూడా తరచుగా వైరల్ అవుతున్నాయి. అజగా అలాంటి ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక రైలు కంపార్ట్‌మెంట్‌లో ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ ఒక యువతి ట్రైన్‌ లోపలికి లాగి కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ 15 సెకన్ల వీడియోలో, ఆ మహిళ రైలు తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమెకు, ఆ మగ వ్యక్తికి ఏదో విషయంపై గొడవ జరుగుతుంది. దీంతో కోపంతో ఆమె ఆ మగ వ్యక్తి మీద ఉమ్మి వేస్తుంది. అంతే అతడిలో కోపం పెరిగిపోతుంది. ఆమె దగ్గరకు వెళ్లి లోపలికి లాగుతూ దారుణంగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు.
ఆ వీడియోలో, ఆ మగ వ్యక్తి ఆ స్త్రీని కొడుతున్నప్పుడు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది అతన్ని ప్రోత్సహిస్తున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ ఘటన రైలు తలుపు దగ్గర జరిగినందున, ఆ స్త్రీ రైలు నుంచి కింద పడిపోయి ఉండే అవకాశం ఉందని చాలామంది ఆందోళన చెందుతున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా రకాల రియాక్షన్లను రేకెత్తిస్తోంది. కొంతమంది ఆ మనిషి చేసిన పనిని సమర్థిస్తున్నారు. ఉమ్మి వేయడం ఆమె తప్పే అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అతను ఎందుకు స్వయంగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు అని మండి పడుతున్నారు. ఒక మహిళపై చేయి చేసే హక్కు అతనికి ఎవరు ఇచ్చారు అని తీవ్ర స్థాయిలో తిట్టిపోస్తున్నారు.
ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారనే దాని గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కొంతమంది ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లేదా బీహార్‌లో చిత్రీకరించబడి ఉంటుందని అనుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోను చూసిన ఒక వ్యక్తి, "సాధారణ కంపార్ట్‌మెంట్లలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణం" అని రాశారు. ఇంకొక వ్యక్తి, "రైలు చాలా ఖాళీగా ఉంది, అయినప్పటికీ ప్రజలు ఎందుకు తలుపు దగ్గర నిలబడుతున్నారు?" అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: