వైరల్: ఉలిక్కిపడ్డ ఆంధ్ర ప్రజలు.. తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ కలకలం..!
అసలు విషయంలోకి వెళ్తే కొత్తపాలెం లేఔట్ లో సత్యనారాయణ రెడ్డి ఇంట్లో భారీగా దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ఆ ఇంటి ఆవరణంలో ఉండేటువంటి సీసీ కెమెరాలు చాలా క్లియర్ గా రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోగా సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు ఒక గదిలో నిద్రిస్తూ ఉన్నప్పటికీ.. కిటికీ బోర్డులను తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన ఈ చెడ్డి గ్యాంగ్ బీరువాలో ఉండేటువంటి నగలు నగదుతో పరారైనట్లుగా అధికారులు తెలియజేశారు.
అంతేకాకుండా బీరువాలోని బట్టలను సైతం కిందికి పడి వేసి మరి నగలు మాత్రమే చోరీ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. బనియన్లు, డ్రాయర్లు ధరించి మరణాయుధాలతో ఇళ్లలోకి చొరబడి మరి దొంగతనాలు వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ చెడ్డి గ్యాంగ్ ఎలా ఎంట్రీ ఇస్తారనే విషయాల పైన సీసీ కెమెరా వీడియోలు కూడా చూపించారు. ఇలాంటి దొంగతనాలు చేసేది కేవలం చెడ్డి గ్యాంగ్ అన్నట్లుగా అక్కడ పోలీసులు కూడా భావిస్తున్నారు. తిరుపతి జిల్లాలో చెడ్డి గ్యాంగ్ ఎంట్రీ తో ఒక్కసారిగా అధికారుల సైతం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న ఈ దొంగల ముఠా కోసం ప్రత్యేకంగా గాలించేందుకు చర్యలు చేపడుతున్నారు అధికారులు .