ఇటీవల కాలంలో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ బాగా పాపులర్ అయ్యాయి. వీటి కారణంగా డెలివరీ బాయ్స్ అనే కొత్త ఉపాధి ఒకలకు దొరుకుతుంది కానీ డెలివరీ ఏజెంట్స్ గా పని చేయడం అంత సులభమైన పని కాదని తెలుస్తోంది. కొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్లు ఒకరోజు డెలివరీ బాయ్ గా పని చేసి తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. మరొక ఢిల్లీ-బేస్డ్ ఒక వీడియో కంటెంట్ క్రియేటర్ జొమాటో డెలివరీ బాయ్‌గా ఒక రోజు పని చేశాడు.
ఇతడు "టెక్ మాన్ జీ" అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ రన్ చేస్తున్నాడు. ఆయన తన వీడియోలో "జొమాటో డెలివరీ బాయ్‌లు రూ.20 సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడతారో మీకు చూపిస్తాను" అని అన్నాడు. ఈ కంటెంట్ క్రియేటర్ తొలుత 1.5 కి.మీ దూరంలో ఉన్న రెస్టారెంట్‌కు ఆర్డర్ తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. తన బైక్‌పై ఆ స్థలానికి చేరుకోవడానికి ఆయనకు ఐదు నిమిషాలు పట్టింది. ఆ తర్వాత ఆర్డర్‌ను తీసుకున్నాడు.
ఆయన ఆర్డర్‌ను డెలివర్ చేయాల్సిన చోటు రెస్టారెంట్ నుంచి 650 మీటర్ల దూరంలో ఉంది. ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి ఆహారం ఇచ్చిన తర్వాత, ఆయన ఆ యాప్‌లో దానికి సంబంధించి ఒక అప్‌డేట్ ఇచ్చాడు. అప్పుడు రూ.20 అతడు సంపాదించినట్లు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ మనీని మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత, సోషల్ మీడియాలో చాలామంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొంతమంది కస్టమర్లు డెలివరీ బాయ్‌లకు టిప్ ఇవ్వాలని సూచించారు. మరికొందరు డెలివరీ బాయ్‌లను గౌరవించాలి, వారితో మర్యాదగా మాట్లాడాలి అని చెప్పారు.
ఇదిలా ఉండగా ఈ సంవత్సరం మొదట్లో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్విగ్గీ డెలివరీ బాయ్‌గా ఒక రోజు పని చేయాలని నిర్ణయించుకున్నారు. దీని వెనుక వారి ఉద్దేశం ఏంటంటే స్విగ్గీ లాంటి ఆహారం డెలివరీ చేసే కంపెనీలు ఎలా పని చేస్తాయి, వాళ్ళు ఏ రకమైన టెక్నాలజీని ఉపయోగిస్తారు అనేది తెలుసుకోవడమే. ఆమె ఈ అనుభవాన్ని లింక్డ్‌ఇన్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ పోస్ట్ కూడా వైరల్ అయింది. ఈ లింక్ https://www.instagram.com/reel/C-NS50RvVUi/?utm_source=ig_web_copy_link పై నొక్కి ప్రస్తుతం వైరల్ అవుతున్నాను, జొమాటో వీడియో చూడవచ్చు.