ఆంధ్ర : మిస్ ఇండియా పోటీలకు ఎంపికైన భవ్య రెడ్డి బ్యాక్ గ్రౌండ్..?
దీంతో అసలు భవ్య రెడ్డి ఎవరు ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాన్ని చాలామంది తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే అందుతున్న సమాచార ప్రకారం హైదరాబాదులో ఆకృతి స్కూల్లో ఈమె చదువుకున్నట్లుగా తెలుస్తోంది. ఈమె తండ్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల మేనేజ్మెంట్ బ్యాచిలర్ చదివారట. భవ్య రెడ్డి కూడా ఒక మోడల్.. అలాగే కార్పొరేట్ ప్రొఫెషనల్ కూడా తాను భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం కలిగిన అమ్మాయి. ఈమె పలు రకాల టీవీ చానల్స్ లో కూడా తన ప్రదర్శనను చేసిందట.
ప్రపంచ తెలుగు ఐటీ కౌన్సిల్ అయిన ఒక ఈవెంట్లో భరతనాట్యంలో పాల్గొనడంతో అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా తన సోలో డాన్స్ తో అందరిని అదరగొట్టేసింది. దీంతో ఈమెను అమెజాన్ , కరారీ జువెలర్స్ వంటి వెబ్సైట్లు కూడా ఈమెను మోడల్ గా తీసుకోవడం జరిగిందట. భవ్య రెడ్డి మానసిక ఆరోగ్య కార్యక్రమం మైండ్ కైండ్ అనే వాటిని నిర్వహిస్తూ ఉంటుందట. దాదాపుగా 1500 మంది యువకులకు చేరువై అనేక ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఇలాంటి హెల్త్ క్లబ్లను సైతం ఈమె ఏర్పాటు చేస్తే బాగానే పాపులారిటీ సంపాదించింది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం ఈమె చేస్తే ఉన్నది. మరి ఈమె మిస్ ఇండియా పోటీలలో విజయం కావాలని ఆంధ్ర అభిమానులు కోరుకుంటున్నారు.