దోమలను చంపే ఐరన్ డోమ్.. ఇదేక్కడి టెక్నాలజీ బాసు?

praveen
సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు దోమల బెడద ఎంతలా పెరిగిపోతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇదొక ప్రధాన సమస్యగా మారిపోతూ ఉంటుంది. వర్షాకాలం వస్తే ఏకంగా దోమలకి మనుషులకి మధ్య జాతి వైరం ఉందేమో అన్న విధంగా.. పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. మనుషులు ఎంతలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దోమలు మాత్రం మనుషులపై దండయాత్రను కొనసాగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే టీవీలో ప్రకటనలు చూసి దోమలను నివారించేందుకు ఎన్నో ప్రొడక్తులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పటికీ చాలా మటుకు మాత్రం ఉపశమనం లభించదు. ఈ క్రమంలోనే దోమలను నివారించేందుకు వాటి భారీ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలో అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు ఏకంగా దోమలను చంపేందుకు ఐరన్ డోమ్ ఒకటి వచ్చేసింది. సాధారణంగా సరిహద్దుల్లో శత్రు దేశాల మిస్సయిల్స్ ను గుర్తించేందుకు ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వాడుతూ ఉంటారు. ఇక ఈ రక్షణ వ్యవస్థ శత్రు  దేశాల మిస్సైల్స్ ని గుర్తించి ఇక ఎంతో సమర్థవంతంగా కూల్చేస్తూ ఉంటుంది.

 అయితే ఇక ఇప్పుడు ఇంట్లో కూడా దోమలను నివారించేందుకు ఇలాంటి ఐరన్ డోమ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. వర్షాకాలంలో దోమల బెడద విపరీతంగా ఉంటుంది. వాటి వల్ల చాలామంది డెంగీ మలేరియా టైఫాయిడ్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర దోమలను చంపి ఒక పరికరానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలో డెంగీ విజృంభిస్తుంది  దోమలను వెతికి నాశనం చేసేలా చైనా వ్యక్తి రూపొందించిన ఈ ఫిరంగిని పొందెందుకు ప్రయత్నిస్తున్న. ఇది మీ ఇంటికి ఐరన్ డోమ్ అంటూ ఒక కామెంట్ చేయగా ఇది వైరల్ గా మారింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: