టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ను శనివారం రోజున కూల్చివేశారు.ఈ కూల్చివేతలపై నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. తుమ్మిడికుంట చెరువు ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్లలోని ఆక్రమణలను సిబ్బంది కూల్చివేశారన్నారు. హైడ్రా, జిహెచ్ఎంసి, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది కూల్చి వేశారని తెలియజేశారు.ఈ నేపథ్యం లో బిగ్‌బాస్ షో అనగానే మొదట గుర్తుకొచ్చేది హీరో నాగార్జున. అటువంటి నాగార్జునపై ప్రముఖ హేతువాది, బిగ్‌బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని కీలక వ్యాఖ్యలు చేశారు.బిగ్‌బాస్ సీజన్ 8 షో నుంచి నాగార్జునను తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారనే అభియోగాలను నాగార్జున ఎదుర్కొంటున్నందున నాగార్జునను షో నుంచి తప్పించడమే మంచిదని బాబు గోగినేని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన ఒక పోస్ట్ చేశారు. ఒకవేళ నాగార్జునన ను బిగ్‌బాస్ షో నిర్వాహకులు తొలగించకుంటే.. బిగ్‌బాస్ హౌస్ మేట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ నాగార్జునను ఎలిమినేట్ చేయాలని బాబు గోగినేని కోరారు. ''ఎలిమినేట్ హిమ్, బిగ్ బాస్ ఇట్లు మీ బిగ్గర్ బాస్ బాబు గోగినేని'' అని పోస్ట్ లో రాసుకొచ్చారు. బిగ్‌బాస్ 8 షో సెప్టెంబర్ 1 నుంచి మొదలుకానుంది. దీనికి నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవలే ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు.తనకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ''ఎన్ కన్వెన్షన్‌ను మేం నిర్మించిన భూమి కబ్జా చేసింది కాదు. అది పట్టా భూమి. మేం ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదు. తప్పుడు సమాచారంతో చట్టవిరుద్ధంగా ఈ కూల్చివేత జరిగింది. కూల్చివేసే ముందు కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు'' అని పేర్కొంటూ నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ వివాదం నేపథ్యంలో నాగార్జున బిగ్‌బాస్ షోలో హోస్ట్‌గా కొనసాగుతారా ? లేదంటే మరో కొత్త హోస్ట్ వస్తారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ నాగార్జున తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే హోస్ట్‌గా ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది.