తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 21 మంది ప్రాణాలు పోయాయి. భారీగా ఆస్తి నష్టం, పంట నష్టం సంభవించింది. వరదల కారణంగా అనేక గ్రామాలలో పరిస్థితి దారుణంగా ఉన్నాయి. అనేక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వరద ముంపుకు గురైన ప్రాంతాలలో పర్యటిస్తూ సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు.ఈ నేపథ్యంలోభారీ వర్షాలు, వరదలతో తెలంగాణ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఇంత విపత్తు జరిగినా కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు వ్యతిరేకంగా హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. అయితే, ఈ పోస్టర్లను ఎవరు అతికించారనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ వరదలతో ప్రజలు అల్లాడుతుంటే... మాజీ ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేదని వారు విమర్శిస్తున్నారు.ఇదిలావుండగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 'కనబడుట లేదు' లేదు అంటూ పోస్టర్లు వెలిశాయి. హైదరాబాద్ లో ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. 'కేసీఆర్ మిస్సింగ్' అంటూ పోస్టర్లపై ప్రింట్ చేశారు. "రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్" అంటూ పోస్టర్లలో విమర్శించారు..ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.ఖమ్మం వరదలపై కేసీఆర్ విచారం వ్యక్తం చేశారని, బాధితులకు సాయం అందించాలని ఆయన ఆదేశించారని హరీశ్ రావు తెలిపారు. నిత్యావసర సరుకులను గురువారం సిద్దిపేట నుంచి ఖమ్మం వరద బాధితుల ఇంటింటికి అందిస్తామని చెప్పారు.