ఇటీవలి కాలంలో ఏసి ల వాడకం బాగా పెరిగింది. దీనికి కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. వేడి వాతావరణం నుండి రక్షణ కోసం చాలా మంది ఎయిర్ కండీషనర్స్ లను గృహాలలో , కార్యాలయాల్లో ఏర్పాటు చేసుకుంటూ సౌకర్యవంతంగా ఉంటున్నారు. అయితే ఇది ఒకింత ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ మరికొన్ని సందర్భాల్లో దీనివల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.ఎయిర్ కండిషనర్స్‌తో ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.ఎండాకాలంలో ఏసీ వాడటం కామన్. ఇతర కాలాల్లో కూడా చాలా మంది ఏసీ వాడుతారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసులు, ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్ హబ్‌లలో ఏసీల వాడకం చాలా ఎక్కువ. 24 గంటలూ ఏసీలు ఆన్‌లోనే ఉంటాయి కొన్ని కంపెనీల్లో. ప్రజలు కూడా ఏసీలకు బాగా అలవాటుపడిపోతున్నారు. చివరకు బస్సుల్లో ప్రయాణిస్తూ కూడా… బయటి నుంచీ గాలి వచ్చే అవకాశం ఉన్నా… ఏసీ బస్సుల్నే ఎంచుకుంటున్నారు. అంతలా ఏసీలకు అలవాటుపడిపోతున్నారు. ఐతే… ఆ చల్లదనం సహజసిద్ధమైనది కాదు కదా… అందువల్ల అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెస్తోందని పరిశోధనల్లో తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే… ఏసీల్లో ఉండటం వల్ల ప్రయోజనాల కంటే, నష్టాలే ఎక్కువ.
ఏసీల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్: డ్రై ఐస్… ఈ రోజుల్లో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య ఇది. కళ్లలో మంటలు, కళ్లకు దురదలు వంటివి ఎక్కువవుతున్నాయి. వీటికి ప్రధాన కారణం ఏసీలో ఎక్కువసేపు ఉండటమే. డ్రై ఐస్ సమస్య ఉన్నవారు ఏసీలకు దూరంగా ఉండాలి.ఏసీ ఆన్ చెయ్యగానే తలుపులు మూసేస్తాం. ఫలితంగా మన నుంచీ రిలీజ్ అయ్యే కార్బన్ డై ఆక్సైడ్‌ను మనమే పీల్చుతూ ఉంటాం. దీని వల్ల ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే… క్రమంగా అది మైగ్రేన్ తలనొప్పిగా మారుతుంది. ఒక్కసారి మైగ్రేన్ తలనొప్పి వస్తే, ఇక అది మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వస్తే ఏమాత్రం తట్టుకోలేం. తల బద్దలైపోతున్నట్లే ఉంటుంది.ఏసీ వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ తక్కువై బాడీ త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వచ్చేందుకు కూడా ఏసీ కారణమవుతుందని తెలుసా మీకు. బీ కేర్ ఫుల్.ఏసీ చల్లదనం ఎంత పెంచితే… మనం అంతగా డీహైడ్రేషన్‌కి చేరుకుంటాం. అందువల్ల ఎక్కువ నీరు తాగాల్సిందే. ఏసీలో ఉండేవాళ్లు ఎక్కువగా నీళ్లు తాగకపోతే, వాళ్లకు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వస్తుంది. ఏసీ వల్ల చర్మం పొడిబారిపోతుంది. ఇక అప్పుడు ఏవో ఒక క్రీములు వాడాల్సిన పరిస్థితి వస్తుంది.ఇన్ఫెక్షన్లు,మెదడు కణాలు బలహీన పడటం,కీళ్ళ నొప్పుల వంటి సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.
ముక్కు, గొంతు, కళ్లు దెబ్బతింటాయి. గొంతులో గరగరగా ఉంటుంది. ముక్కు దిబ్బడ వచ్చినట్లు అవుతుంది. దీనికి కారణం ఏసీ వల్ల వచ్చే వైరల్ అలర్జీలే.ఆస్తమా వంటి సమస్యలు వస్తాయి. మనకు ఏ అనారోగ్యమూ లేనంతకాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆస్తమా లాంటి సమస్యలు వచ్చాయంటే… అవి ఓ పట్టాన పోవు. ఎన్ని మందులువాడినా తగ్గవు. ఏసీ వల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి… వీలైనంతవరకూ ఏసీకి దూరంగా ఉండాల్సిందే.నీరసం, నిస్సత్తువ, ఏదో పోగొట్టుకున్నవారిలా తయారవుతాం. ఇలాంటి అనారోగ్య సమస్యలన్నింటికీ కారణం ఈ కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చే ఏసీలే. కాబట్టి ఏసీలకు దూరంగా ఉండాలి.ఏసీల వల్ల మరో సమస్య అలర్జీలు. ఎలుకలు, పందికొక్కులూ… వివిధ ఆఫీసుల్లోని సెంట్రల్ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. అడ్డమైన వ్యర్థాల్నీ అక్కడికే తెచ్చి తింటాయి. ఫలితంగా ఏసీల్లో విషపూరితమైన వాతావరణం ఉంటుంది. మనం ఏసీ వెయ్యగానే… ఆ విష వ్యర్థాల గాలిలో కలిసి… మనల్ని చేరతాయి. ఆ తర్వాత మనకు రకరకాల వ్యాధులు వచ్చేందుకు కారణం అవుతాయి. అందువల్ల ఏసీలను నెలకోసారైనా క్లీన్ చెయ్యాలి.
అందువల్ల ఏసీలో ఉండేవారు అప్పుడప్పుడూ సహజసిద్ధమైన వాతావరణంలో గడిపేందుకు సమయం కేటాయించాలి. ఇలా చేయటం వల్ల మన శరీరం అన్ని వాతావరణాలను తట్టుకునేలా మనగలుగుతుంది. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో తప్ప ఇతర సమయాల్లో సాధారణ వాతావరణంలో గడపటానికే ఆసక్తి చూపాలి. ఏసీలోని ఫిల్టర్స్ తరచూ శుభ్రపరుస్తూ ఉండాలి. ఫిల్టర్స్‌ను సబ్బుతో కడగాల్సి వచ్చినప్పుడు అవి ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపించకుండా ఉంటాయి. అత్యవసర వినియోగానికి తప్ప ఏసిలను వాడకపోవటమే మంచిది.వీలైనప్పుడల్లా… బయటి వాతావరణంలో ఉండాలి. ఆఫీసులు, కంపెనీల్లో తలుపులు, కిటికీలూ తెరవాలి. సహజసిద్ధమైన గాలిని లోపలికి రానివ్వాలి.