రన్నింగ్ ట్రైన్ లో స్టంట్ చేసిన యువతి.. తలకు స్తంభం తగలడంతో.. ?

frame రన్నింగ్ ట్రైన్ లో స్టంట్ చేసిన యువతి.. తలకు స్తంభం తగలడంతో.. ?

praveen

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే తమ వీడియోలు అందరికీ రీచ్ కావాలని చాలామంది ఆశిస్తున్నారు. ఇందుకోసం ప్రమాదకరమైన స్టంట్స్‌ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొంతమంది రీల్స్ మోజులో పడి ప్రాణాలు కూడా తీసుకున్నారు. కొందరైతే శాశ్వతంగా అవిటి వాళ్ళయ్యారు. ఇలాంటి దృశ్యాలు కళ్ళ ముందు కనిపిస్తున్న సరే నేటి యువత మూర్ఖపు పనులు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో, ఒక యువతి తన జీవితాన్ని లెక్క చేయకుండా, వైరల్ రీల్ కోసం ప్రయత్నిస్తుంది. ఓ అతివేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి బయటికి వెళుతుంది, ఒక ఎంట్రన్స్ స్టోర్ దగ్గర ఉన్నాను హ్యాండ్ బార్స్ పట్టుకొని పట్టుకుని వేలాడుతుంది. ఆ సమయంలో ట్రైన్ చాలా వేగంగా దూసుకెళ్తుంది. ఇలా చేయడం ద్వారా తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకోవాలనుకుంది. ఈ సమయంలో రైలు లైన్‌కు దగ్గరగా ఉన్న ఒక స్తంభానికి తల తగిలింది. అంతేకాదు, ఆమెకు స్పృహ తప్పిపోయే స్థితికి చేరుకుంది.
తల గుద్దుకున్నప్పటికీ, ఆ అమ్మాయి ట్రైన్ హ్యాండిల్‌ని వదలకుండా గట్టిగా పట్టుకుంది. అంటే, ఆమె ఒక భయంకరమైన ప్రమాదం నుంచి కొంత అదృష్టవశాత్తు తప్పించుకుంది. ఈ వీడియో అలాగే అంతమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొంతమంది ప్రకారం ఆమె ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరిక ఎంతటి ప్రమాదకరమో ఈ వీడియో మనకు తెలియజేస్తుంది.
ఒక చక్కటి వీడియో తీయాలనే తాపత్రయంలో చాలామంది యువత ప్రమాదాలను పట్టించుకోరు. అలాంటి ప్రమాదాల వల్ల వాళ్ళకు చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. ఈ సంఘటన మనకు ఒక పాఠం చెబుతుంది. అది ఏంటంటే, కొంతకాలం ఫేమస్ కావాలనే కంటే, మన ప్రాణాలు రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ https://x.com/Horror_clip/status/1828386961822015629?t=FU_PMxaoQFjrA6R7InRc7Q&s=19 వీడియో పై క్లిక్ చేసి చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: