ఏపీ: వరద బాధితుడిగా మిగిలిన డిప్యూటీ సీఎం.!

FARMANULLA SHAIK
ఏపీలో గత వారం క్రితం భారీగా వర్షాలు కురిసాయి. దీంతో విజయవాడ వంటి పలు నగరాల్లో తీవ్రంగా వరదలు ఏర్పడ్డాయి. కొంతమంది ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇంట్లో ఉన్న సామాన్లతో సహా అన్నింటిని కోల్పోయారు. దీంతో కొంతమంది వరద బాధితులకు వారికి తోచినంతగా సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో అందరి దృష్టి ఆకర్షించిన నియోజకవర్గం పిఠాపురం. కారణం అక్కడి నుంచి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడమే. కూటమి సహాయంతో ఆయన భారీ మెజార్టీతో గెలవడంతో పిఠాపురం దశ మారుతుందని అందరూ భావించగా.. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పరిస్థితి మారలేదు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలైనా పిఠాపురంలో ఒక్క అభివృద్ధి పని చేయలేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా వరదలు చుట్టుముట్టాయి. అయితే వరదలపై ముందు నుంచే నిర్లక్ష్యంగా ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ దూరంగా ఉన్నారు. చుట్టపు చూపుగా ఒకరోజు వరద ప్రాంతాల్లో పర్యటించి హైదరాబాద్‌కు చెక్కేశారు. కానీ మంగళవారం మళ్లీ పిఠాపురం నియోజకవర్గంలో వరద ముప్పు మరింత తీవ్రమైంది.

ఈ క్రమంలో కాకినాడజిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, చిన్నపాటి నదులు పొంగిపొర్లాయి. దీంతో  అటునుంచి ప్రవహిస్తున్న ఓ వాగుకు భారీ గండి పడటంతో నీరు మొత్తం రోడ్లపైకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రధాన రోడ్లు మొత్తం జలమయం గా మారాయి. అలాగే పంట పొలాలు, చెలకలు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఈ భారీ వరదల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పొలాలు కూడా మునిగిపోయినట్లు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తున్నారు.ఈ క్రమంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు వరద ఉగ్రరూపం దాల్చింది. డిప్యూటీ సీఎం  పవన్ కల్యాణ్ ఇంటి స్థలం కూడా మునిగిపోయింది. పిఠాపురం గొల్లప్రోలు మధ్య 216 జాతీయ రహదారి పక్కన పవన్ ఇంటి స్థలం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేగా గెలిచాక సొంత ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం 3 ఎకరాల 52 సెంట్లు స్థలం కొనుగోలు చేశారు. ఏలేరు వరద ప్రభావంతో ఇంటి నిర్మాణ స్థలం నీటి ముంపులో చిక్కుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: