తెలంగాణ సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం... హైడ్రా గూర్చి చర్చ.!

FARMANULLA SHAIK
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలం అయిందే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మంలోని మున్నేరు వాగు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మున్నేరు వాగు ప్రవాహానికి మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలు అన్ని నీట మునిగాయి. ఇక్కడ ఒకానొక సమయంలో వరద ఉద్ధృతి 36 అడుగుల వరకు ప్రవహించింది. దీంతో బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. తరలించడానికి వీలులేని వారు ఇంటి పై కప్పులపై ఉంటూ సహాయం కోసం ఎదురు చూశారు.మున్నేరు వరద దాటికి తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత ఎటు చూసిన హృదయవిదాకరమైన సన్నివేశాలే కనిపించాయి. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సామాన్యులు ఇలా అందరూ వారికి తోచిన విరాళాలను సీఎం సహాయక నిధికి అందించారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీ జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు.అలాగే  ఇప్పుడు ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ భారీ వర్షాలు, వరదలతో సతమతం అవుతున్న తెలంగాణకు వరద సాయాన్ని అందించారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పవన్ కళ్యాణ్‌ చెక్కును అంద చేశారు.

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద సహాయక చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని అందచేశారు. వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేసినట్టు జనసేన వర్గాలు తెలిపాయి.
అలాగే విజయవాడలోని బుడమేరు వాగుకు వచ్చిన వరదతో విజయవాడ వరద నీటితో మునిగిపోయింది. వరద తగ్గి వారం అయిన కొన్ని ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. దీంతో వేల కోట్లు నష్టం వాటిల్లింది. అప్పుడు వరద బాధితులకు సహాయార్థం ప్రముఖులు విరాళాలు ప్రకటించారు.ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం వ్యక్తిగతంగా రూ.కోటి నగదును విరాళం ఇచ్చారు. ఆ చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. అలాగే వరద ముంపునకు గురైన గ్రామాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణ వరద బాధితులకు కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ చెక్కును సీఎం నివాసానికి వెళ్లి పవన్ అందించారు.ఇదిలావుండగా అదనంగా, రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన నాలుగు వందల గ్రామాలకు ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయల నిధి కింద మొత్తం నాలుగు కోట్ల విరాళాన్ని ప్రకటించడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: