ఏపీలో మరో దారుణం.. స్కూల్ విద్యార్థులపై లైంగిక దాడి.. విస్తుపోయే నిజాలు..!

Divya
గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మహిళల పైన జరుగుతున్న అన్యాయాల వల్ల చాలామంది నేతలు ఇప్పటికి అధికారులను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పైన మహిళల పైన జరుగుతున్న అత్యాచారాలు కూడా రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరొక ఉదాంతం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లాలోని అమీనా పేటలో శ్రీ స్వామి సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన అత్యాచారం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సుమారుగా 50 మంది బాలికలు సైతం నివసిస్తున్నారట. అయితే వీరంతా వేరువేరు విద్యాసంస్థలలో చదువుకుంటున్నట్లు సమాచారం.

కరోనా సమయంలో ఈ ఆశ్రమం నిర్వాహకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏలూరుకి చెందిన శశికుమార్ ఈ ఆశ్రమాన్ని దక్కించుకున్నారట. అలా ఈ హాస్టల్కి వార్డెన్ గా కూడా పనిచేస్తున్నారట. ఒక ఫోటో స్టూడియో కూడా నడుపుతూ ఉండేవారట. హాస్టల్ వార్డెన్ కు  రెండో భార్య మనీశ్రీనీ,అలాగే తన మేనకోడలు లావణ్యని విద్యార్థులకు సంరక్షకురాలిగా నియమించారట. అలాగే విద్యార్థులను ఫోటో షూట్ల పేరుతో మాయమాటలు చెప్పి లోపరుచుకునే వారని విద్యార్థులు తెలియజేస్తున్నారు.

ఫోటో షూట్ల కోసమే శశి కుమార్ బాలికలని సదూర ప్రాంతాలకు తీసుకువెళ్లే వారి పైన అఘాయిత్యానికి పాల్పడేవారు అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ అడ్డు చెబితే వారిని కొట్టే వారంటూ కూడా ఆ విద్యార్థులు కన్నీటి పర్వతం అవ్వుతున్నారు. వసతిగృహంలో చాలా చిత్రహింసలకు బాలికలను గురి చేసేవారని అడ్డు చెబితే దాడికి కూడా పాల్పడే వారిని పలువురు బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి ఆ వార్డెన్ మీద కంప్లైంట్ చేశారు. వార్డెన్ శశికుమార్ ఇప్పటికే పదుల సంఖ్యలో బాలికల పైన లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే గత ఆదివారం ఒక బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకొని మరి ఆమె పైన అత్యాచారం చేసిన సంఘటన తెలియడంతో ఈ విషయం పైన పోలీసులను ఆశ్రయించారట హాస్టల్ విద్యార్థులు. అలాగే కుటుంబ సభ్యుల బాలికలు అందరూ కలిసి టూటౌన్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించడంతో అక్కడ ఉధృత నెలకొంది. ఆ వార్డెన్ పైన పోలీసులు కూడా ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారట. ప్రస్తుతం శశి కుమార్ పరారీలో ఉన్నట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు. త్వరలోనే పట్టుకుంటామని తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: