తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూ వివాదంపై హిందూ సంఘాలు, శ్రీవారి భక్తులంతా వైసీపీ పార్టీని దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదంలో ఒక్కో విషయం బయటికి వస్తుంటే.. అంతా షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. స్వచ్చమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన .. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డూ ప్రసాదంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని.. ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా శుక్రవారం కోరారు.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా గత 2 రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన అంశం తిరుపతి లడ్డూ. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు ఉపయోగించారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. దీంతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అదే సమయంలో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణం అయింది. తిరుపతి లడ్డూ తయారీకి సంబంధించి నాణ్యమైన నెయ్యి వాడటం లేదని కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఇక ఇదే సమయంలో నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు.పవన్ కల్యాణ్ గారు...మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది .. దయచేసి దర్యాప్తు చేయండి .. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనలను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.దీన్ని జాతీయ సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారని పవన్ కల్యాణ్‌ను ఆయన నిలదీశారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇదే సమయంలో కేంద్రంలో ఉన్న బీజేపీకి సైతం కౌంటరిచ్చారు. కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ సెటైర్స్ వేశారు. చివరగా జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ కౌంటరిచ్చిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.