అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి.. బాడీ బిల్డర్ నే పరిగెత్తించి కొట్టింది?

praveen
ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుగుతున్న వేధింపులు ఎంతలా పెరిగి పోతున్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. అమ్మాయిలు ఒంటరిగా కనిపించారు అంటే చాలు ఏకంగా ఆకతాయిలు చిత్ర విచిత్రం గా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలం లో అయితే ఆకతాయిలు మరింత రెచ్చి పోతున్నారు. పక్కన కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వేధింపులకు గురి చేసేందుకు ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి.

 అయితే ఇలా ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురి చేస్తున్నారు అంటే చాలు అటు అమ్మాయిలు కూడా తెగ భయపడి పోతున్నారు. అమ్మో వాళ్ళని ఏమైనా అంటే ఏం చేస్తారో అని భయ పడిపోతూ ఉండడం చూస్తూ ఉన్నాం. కానీ అమ్మాయిలు ఇలా భయ పడటం కాదు పోకిరి చేష్టలు చేసిన వారికి ఎలా బుద్ధి చెప్పాలి అని ఇక్కడ ఒక అమ్మాయి చేసి చూపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారి పోయింది  రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక అమ్మాయిని చూసి ఒక కుర్రాడు షర్టు విప్పేసి తన కండలు చూపించాలి అనుకున్నాడు.

 అయితే ఆ యువతి పక్కన ఉన్న యువకుడు ఇది చూసి ఆ పోకిరి వెదవ కు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్తుంటే.. నువ్వు ఆగు అంటూ స్నేహితుడికి చెప్పిన అమ్మాయి ఏకంగా షర్టు విప్పి కండలు చూపించేందుకు ప్రయత్నించిన పోకిరి చెంప చెల్లు మనిపించింది. వెంటనే షర్ట్ వేసుకో అంటూ అతన్ని ఉరికించి ఉడికించి మరీ కొట్టింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారగ అమ్మాయిల అంటే ఇలా ఉండాలి ఏకంగా పోకిరి చేష్టలు చేసే వారి పట్ల ధైర్య సాహసలు ప్రదర్శించి సరైన బుద్ధి చెప్పాలి అంటూ ఎంతో మంది నెటిజన్స్ సోషల్ మీడియా లో కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: