వైరల్: మొబైల్లో అవి చూస్తున్నారా అయితే జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ..!

Divya
ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నది.. ముఖ్యంగా చాలామంది మొబైల్స్ లో పోర్న్ వీడియోలు చూస్తున్నట్లుగా ఒక నివేదిక ఇటీవలే తెలియజేసిందట. ఎక్కువమంది చైల్డ్ పోర్న్ వంటి వీడియోలను చూస్తున్నారని ఈ విషయం పైన సుప్రీంకోర్టు ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.. ఇక మీదట ఎవరైనా సరే మొబైల్ లో ఇలాంటి వీడియోలు చూసిన లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న షేర్ చేసిన కూడా జైలు శిక్ష తప్పదు అంటూ తెలియజేస్తోంది.
ఫోక్సో చట్టం ఈ విషయం పైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అంటు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎవరు కూడా చైల్డ్ ఫోర్నుగ్రఫీ అనే పదాన్ని సైతం ఉపయోగించకూడదని ఇటీవలే ధర్మాసనం కూడా ఆదేశాలను జారీ చేసిందట. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు కూడా ఒక సంచలన తీర్పు ఇవ్వడంతో వాటిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.. 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు చైల్డ్ పోర్నో గ్రఫీ  వీడియోలను సైతం డౌన్లోడ్ చేసుకున్నారని ఫోక్సో చెప్పటానికి కింద అరెస్టు చేయడం జరిగిందట. ఆ యువకుడిని  కోర్టులో కూడా హాజరపరిచారు.

దీంతో కోర్టు ఇతడికి శిక్ష కూడా ఖరారు చేయడంతో వెంటనే ఆ యువకుడు మద్రాసు హైకోర్టును సైతం ఆశ్రయించడం జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు ఇలా తీర్పుని విడుదల చేస్తూ.. వీడియోలు డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు ఎవరికి షేర్ చేయలేదు కానీ ఎలాంటి వేధింపులకు గురి చేయలేదనీ గుర్తించిన కోర్టు ఆ యువకుడు మీద క్రిమినల్ చర్యలు నిలిపివేయాలి అంటూ ఈ ఏడాది జనవరిలో మద్రాస్ హై  కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ పిటిషన్ పైన సుప్రీంకోర్టులో కూడా చాలానే దాఖలు రావడంతో.. ఈ రోజున విచారణ జరుపబోతున్నారట.. మద్రాస్ హైకోర్టు తీర్పును న్యాయవాదులు తప్పుబడుతూ చైల్డ్ ఫోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా ఫోక్సో  చట్టం కిందికే వస్తుంది అంటూ ఇది కూడా నేరమే అంటూ తెలియజేస్తున్నారట. అందుకే మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హైకోర్టు హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: