ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుంది. చిన్న పట్టణాల నుంచి మెట్రోపాలిటన్ నగరాలకు డ్రగ్స్ వ్యాపారం మూడు పువ్వులు అరవై కాయలుగా కొనసాగుతుంది స్కూల్ కాలేజీ యూనివర్సిటీలు డ్రగ్స్.విక్రయ కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యాపారం మాఫియా యువతను నిర్వీర్యం చేస్తూ లక్షల కోట్ల చీకటి వ్యాపారం చేస్తున్నాయి. యువత మత్తు కు ఆకర్షితులై మత్తు నుండి బయట పడలేక తమ జీవితాలను బలిచేసుకుంటున్నారు. కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడు తున్నారు.ఈ నేపథ్యంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న టీ ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్, దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం మాదకద్రవ్యాలకు అలవాటుకాలంలో ఉన్నారు అని చెప్పారు.డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు.ఈ సమస్యపై సమాజాన్ని అవగాహన చేసేందుకు, ఏ ఒక్కరు డ్రగ్స్ అమిన్న, కొనుగోలు చేసిన విషయాలు వెల్లడించాలనుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ప్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.ఇదిలావుండగా ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాల్లో గంజాయి సాగు అవుతుంది. దేశంలో అనేక రాష్ట్రాలలో ఈ సమస్య తీవ్రంగా వుంది ఈశాన్య రాష్ట్రాలు అంతర్జాతీయ పోర్టులు ప్రైవేట్ పోర్టులు ద్వారా ఎక్కవ సప్లయ్ అవుతుంది కృష్ణా పట్నం పోర్టు శంషాబాద్ ఎయిర్ పోర్టులో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. అభివృధి చెందుతున్న పేద దేశాలలో ఈ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. ప్రపంచీకరణ కార్పొరేటీకరణ ప్రభావం వల్ల డాగ్స్ వ్యాపారం విస్తరిస్తుంది. 20 30 నాటికి మాదకద్రవ్యాల వ్యాపారం 11% పెరిగిపోతుందని ఐ’రా’స నివేదిక పేర్కొంది. ఆకలి ‘దారిద్రం ‘పేదరికం నిరుద్యోగం’ వైద్యం అందకపోవడం లాంటి అనేక సమస్యలతో సతమవుతున్న ప్రజలను కార్పొరేట్ సంస్థలు మాదకద్రవ్యాల వ్యాపారంతో దేశాన్ని దోచుకోవడంతో పాటు యువతను నిర్వీర్యం చేస్తున్నారు. మత్తుకు బానిస లైన యువత డాగ్స్ ను పొందడం కోసం అనేక ఘాతకాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.