ఇదేం పిచ్చి రా అయ్యా.. భార్య బికినీ వేయడానికి ఐలాండ్ కొనేసిన భర్త..!
దుబాయ్ ప్రాంతానికి చెందిన ఒక మిలియనిర్ లలో ఒకరైన జమాల్ ఆల్ సదాక్ తన భార్య సౌదీ అల్ నాదాక్ కోసం ఏకంగా హిందూ మహాసముద్రంలో ఉండేటువంటి ఒక ఐలాండ్ ను సైతం కొనుగోలు చేశారట. అందుకోసం ఏకంగా 50 మిలియన్ల డాలర్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ .418 కోట్ల రూపాయలు ఉంటుందట. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ లో తెలియజేశారు. అలాగే ఐలాండ్ వీడియోని కూడా షేర్ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా తన భార్య బికినీ ధరించాలి ఈ ద్వీపాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు.
దీర్ఘకాల పెట్టుబడి గురించి తామిద్దరం ఎక్కువగా ఆలోచించామని ఆ సమయంలోనే ఇలా గోపిక పైన దృష్టి పెంచామని.. తాను బీచ్ లో సురక్షితంగా సేద తీరాలని తన భర్త కోరిక అందుకే ఇలా ఐలాండ్ ని సైతం సొంతం చేసుకోవాలని ఆలోచన తమకు వచ్చిందని ఈ వీడియో ద్వారా తెలియజేశారు. ఆద్వీపం ఆసియా ఖండంలో ఒకటని తెలియజేశారు. కానీ అందుకు సంబంధించి పూర్తి విషయాలను మాత్రం తెలుపలేదు. అయితే ఈ దుబాయ్ మిలియన్ చేసిన ఈ పనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు. భార్య బికినీలో సేదతీరడం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలా ఇదేం పిచ్చి రాఆయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే ఈ బిలినియర్ ఇంతటి ధనవంతుడైన కూడా ఒక చార్టెడ్ విమానం కూడా లేదట. మరి ఆ ఐలాండ్ కొన్న విషయం నిజమో కాదో తెలియాల్సి ఉన్నది.