వైరల్: గాంధీ హత్య వెనుక ఇంత కుట్ర జరిగిందా..?

Divya
మహాత్మా గాంధీనీ గాడ్సే తుపాకితో కాల్చి చంపారనే విషయం యావత్ దేశానికి తెలిసిన విషయమే.. కానీ గాడ్సే కేవలం గాంధీని రెండుసార్లు మాత్రమే తుపాకీతో కాల్చాలనుకున్నారట. కానీ చివరికి మూడుసార్లు మహాత్మా గాంధీని గాడ్సే చంపడం జరిగిందట.. అయితే అలా ఎందుకు చంపారు అనే విషయాన్ని గాడ్సే విచారణలో చాలా క్లియర్ గా వివరించినట్లు తెలుస్తోంది. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ఇందుకు సంబంధించి విషయం అయితే వైరల్ గా మారుతున్నది.

1948 జనవరి 30వ తేదీన దేశ విభజనకు హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలే ముఖ్య కారణమట. ఇందుకు కారణం గాంధీనే అని చాలామంది ఆయన పైన కోపంగా ఉండేవారట.. అలా గాంధీ న్యూఢిల్లీలో ఉండగా జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయలేకపోయినా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, హోం మంత్రిగా ఉన్న వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి వారు తమ పదవులకు రాజీనామా చేయాలని భావించారట. జనవరి 30 వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో తన గది నుంచి బయటికి వచ్చారట.

గాంధీ కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తూ ఉండేవారట. కానీ గాంధీజీ మాత్రం ఎప్పుడు కూడా భద్రత లేనిదే బయటికి వచ్చేవారు కాదట.. కానీ జనవరి 30 సాయంత్రం మాత్రం సెక్యూరిటీ లేకుండా ప్రేయర్ మీటింగ్కి వెళ్తున్న సమయంలో తన అసిస్టెంట్ తో మాట్లాడాలని జనాల మధ్య మాట్లాడాలని కొద్దిసేపు ఆగారు. అలా అభివాదం చేస్తున్న సమయంలో మెల్లగా గాడ్సే గాంధీ దగ్గరకు వెళ్లి మూడుసార్లు కాల్చారట. గాంధీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయి హరే రామ అంటూ కన్నుమూశారట. అయితే అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడడంతో గాడ్సే పారిపోకుండా పోలీసులను అరెస్టు చేయమని సూచించారట.
గాంధీజీని చంపడానికి వాలిన పీస్టల్  బెరట్టా 606824 . దీనిని మధ్యప్రదేశ్ నుంచి గాంధీని చంపడానికి రెండు రోజుల ముందు కొన్నట్లుగా తెలియజేశారు గాడ్సే.. ఇవన్నీ విచారణలో భాగంగా గాడ్సే తెలిపారుట.. అలాగే తాను గాంధీ దగ్గరికి గౌరవంతో వెళ్లలేదనీ తనని కాల్చాలని అది మిస్ అవ్వకూడదని పట్టుదలతోనే వెళ్లానని తెలిపారు. పిస్టల్ సేఫ్టీ క్యాప్ తీసి మరి దగ్గర నుంచి కాల్చాలని తన టార్గెట్ అని అందుకే గాంధీని మాత్రమే చంపారు అక్కడ ఉన్న ప్రజలకు ఏమి కాకూడదని రెండుసార్లు గాంధీజీ శరీరం మీద కాల్చిన  ఆ తర్వాత తనలో ఉత్సాహం పెరిగి మూడవసారి కూడా కాల్చాలని తెలిపారు గాడ్సే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: