అంతరిక్షం నుంచి దూకి.. గంటకు 1457 కి,మీ భూమ్మీదికి దూసుకొచ్చి.. ఎలా దిగాడో చూడండి?

praveen
స్కై డైవింగ్ అడ్వెంచర్స్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ స్కై డైవింగ్ ని ఎంతలా ఇష్టపడుతూ ఉంటారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటివరకు ఎంతోమంది ఇలా స్కై డైవింగ్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. విమానాలు నుంచి పారాషూట్ లో సహాయంతో ఎంతోమంది సాహసికులు కిందకి దూకేయడం మనం చూస్తూ ఉంటాం. ఇక ఇలా దూకుతూ సరైన సమయంలో పారాషూట్ ఓపెన్ చేసి ఎంతో సురక్షితంగా భూమ్మీద ల్యాండ్ అవుతూ ఉంటారు. ఇప్పటివరకు ఇలా విమానాల నుంచి దూకి స్కై డైవింగ్ చేసిన వారిని ఎంతో మందిని చూశాను.

 కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాత్రం కనీ విని ఎరుగని స్కై డైవింగ్. అతను కూడా ఇలాగే గాల్లోకి ఎగిరి దూకాడు. కానీ అందరూ అనుకున్నట్లుగా విమానం నుంచి కాదు  ఏకంగా అంతరిక్షం నుంచి భూమి మీదకి దూకాడు. మొదట అతనికి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇది పిచ్చి ఆలోచన అనే అందరూ అన్నారు. కానీ దీనిని ఆచరణలో పెట్టాలి అని అతను అనుకున్నాడు  ఆరేళ్లపాటు కష్టపడి అనుకున్నది సాధించాడు. ఏకంగా ధ్వని కంటే ఎక్కువ వేగంతో భూమి వైపు ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించాడు.

 అయితే ఈ చారిత్రాత్మక ఘటన జరిగి దాదాపు 12 ఏళ్లు కాగా నాటి వీడియో మరోసారి వైరల్ గా మారిపోయింది. ఆస్ట్రీయకు చెందిన ఫిలిప్స్ బాబ్ గార్నర్ ఇ ప్పటికి ఎన్నో సాహస క్రీడలు చేసి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అంతలోనే అంతరిక్షం నుంచి స్కై డైవింగ్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన వచ్చింది. ఇక ఆలోచన రావడమే తడువు ఈ సాహసం చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ రెడ్ బుల్ సంస్థ ఇక ఈ సాహసానికి స్పాన్సర్ గా వ్యవహరించింది.భూమి నుండి 30 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటోస్పియర్ అనే పొర ఉంటుంది. అత్యల్ప పీడన ఉష్ణోగ్రతలు ఉంటాయి. అంటే ఇది దాదాపు ఆకాశం అంచు అన్నమాట. తర్వాత అంతా అంతరిక్షం హీలియం బెలూన్ క్యాప్సిల్ 38,969 మీటర్లు ఎత్తుకు చేరుకున్నాక.. ఫిలిప్స్ కిందకు దూకాడు. నాలుగు నిమిషాల్లో అతను నేరుగా భూమికి చేరుకున్నాడు. పారాషూట్ తెరవలేదు. దీంతో ఒకానొక సమయంలో అతని వేగం గంటకు 1357 కిలోమీటర్లు చేరుకుంది. వాతావరణంలోకి చేరుకున్నాక అతను పారాషూట్ తెరిచి ఎంతో సురక్షితంగా భూమ్మీదికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: