మీ పిల్లలకు మొబైల్ ఇస్తున్నారా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే..?

Divya
ఈ మధ్యకాలంలో పిల్లలు మొబైల్ కి ఎంతగా అడేక్ట్ అయ్యారంటే ఇవ్వకుంటే ఎంతకైనా తెగించేలా కనిపిస్తున్నారు.. అందుకు సంబంధించిన ఘటనలు కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ గా మారుతూ ఉన్నాయి. అయితే ఒక అబ్బాయి మొబైల్ కి ఆడేక్ట్ అయ్యి ఒక దారుణమైన ఘటనకి ఓడి కట్టాడు.  మొబైల్ ని తల్లి గుంజుకోవడంతో తన తల్లిని బ్యాట్ తీసుకొని మరి బాదిన ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకి మొబైల్ ఇవ్వకూడదని చాలామంది తెలియజేస్తూ ఉంటారు.

వీడియోలో కనిపిస్తున్న ప్రకారం.. మొబైల్లో గేమ్ ఆడుతున్న పిల్లోడి దగ్గర నుంచి తల్లి మొబైల్ తీసుకొని పక్కనే ఉన్న పుస్తకాన్ని తీసుకొని చదవమంటూ హెచ్చరిస్తుంది. దీంతో ఆ పిల్లాడు పుస్తకాన్ని చదవడం మొదలు పెడతాడు అలా కొద్దిసేపు తర్వాత ఎందుకు లేచి మరి పక్కకు వెళ్లిపోయి వచ్చేటప్పుడు మధ్యలో ఉన్న ఒక బ్యాటును తీసుకొని ఒక్కసారిగా తన తల్లి తల పైన కొడుతున్నట్టుగా ఈ వీడియోలో కనిపిస్తోంది దీంతో ఆ తల్లి క్షణాల వ్యవధిలో స్పృహ కోల్పోయి కిందికి పడిపోయినట్లుగా కనిపిస్తోంది.

కానీ ఆ పిల్లోడు మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన తల్లి చేతిలో ఉన్న మొబైల్ ని తీసుకొని మళ్ళీ చూడడం ప్రారంభిస్తారు. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొబైల్ కి అడిక్ట్ అయిన పిల్లలు ఇంత క్రూరంగా మారిపోతాయి ఈ వీడియో అందుకు ఉదాహరణ అన్నట్టుగా తెలియజేస్తున్నారు. అయితే ఆ తర్వాత ఆ తల్లికి ఏమయ్యింది అనే విషయం మాత్రం తెలియడం లేదు కానీ పిల్లలకు మొబైల్ ఇవ్వకుండా ఉండడమే మంచిది అంటూ పలువురు నేటిజన్ సైతం తెలియజేస్తున్నారు. పిల్లలను కేవలం ఆడుకోవడానికి బయటకి పంపించడమే ఉత్తమమని పలువురు నిపుణులు కూడా సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: