వామ్మో: రతన్ టాటా నిమిషానికి ఎంత సంపాదిస్తారో తెలుసా..?

Divya
ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా నిన్నటి రోజున వృద్ధాప్య సమస్యలతో మరణించారు. దీంతో రతన్ టాటా గురించి కొన్ని విషయాలు ఆయన జీవితంలో జరిగిన విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అయితే వ్యాపారాలను లాభదాయకంగా నడిపించిన ఘనత అందుకున్న రతన్ టాటా.. ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు 100కు పైగా దేశాలలో తన కంపెనీలను విస్తరింప చేసేలా చేశారు. మొదట టాటా స్టీల్ ప్లాంట్ లోని కొలిమి వద్ద తన జీవితాన్ని ప్రారంభించిన రతన్ టాటా ఉద్యోగ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించారట.. 1991 నుంచి 2012 వరకు టాటా సన్స్, టాటా గ్రూప్ చైర్మన్ గా కూడా పనిచేశారు.

రతన్ టాటా వార్షిక వేతనం 2.5 కోట్ల రూపాయలు అంటే ప్రతినెల సుమారుగా 20.83 లక్షల ఆదాయమట ప్రతిరోజుకు 70,000 రూపాయలు గంటకు 2,900 రూపాయల చొప్పున నిమిషానికి 49 రూపాయలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం టాప్ పారిశ్రామికవేతలతో పోలిస్తే ఈయన జీతం చాలా తక్కువ అని కూడా చెప్పవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్న ముఖేష్ అంబానీ నిమిషానికి 3 లక్షల పైగా సంపాదిస్తారట.. సెకండ్ కు 51,250 రూపాయలు తీసుకుంటారట రతన్ టాటా రోజు సంపాదన కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది.

రతన్ టాటా ప్రపంచంలోనే టాటా గ్రూప్ లీడర్ అయినప్పటికీ కూడా ఈయన జీతం చాలా తక్కువగానే తీసుకుంటారు.. ప్రజల పట్ల మూగజీవాల పట్ల రతన్ టాటా ఎక్కువ మక్కువ చూపుతో ఉంటారు. రతన్ టాటా ఎక్కువ డబ్బులు సంపాదించి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆలోచన ఎప్పుడూ లేదని ఆయన స్నేహితులు సైతం తెలియజేస్తూ ఉంటారు. తన సంపాదనలో ఎక్కువగా స్వచ్ఛంద సంస్థలకు జంతువులకు వైద్య విద్య రంగాలలో ఖర్చులకు ఇలా అన్నిటికీ కూడా తన సంపాదన కంటే ఎక్కువ ఖర్చ చేస్తూ ఉంటారట. ముఖ్యంగా ఆయన సామాన్యుల వైపే ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. ఈయన ఆస్తి 3800 కోట్ల రూపాయలు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: