దసరా రోజున జమ్మి చెట్టుని పూజించడం వల్ల కలిగే లాభాలు..?

Divya
హిందువులు దసరా పండుగని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దసరా పండుగను కూడా విజయదశమని పిలుస్తూ ఉంటారు. అంటే ఈ రోజున జమ్మి చెట్టును చాలా మంది హిందువులు పూజిస్తూ ఉంటారు. దసరా చివరి రోజున విజయదశమి జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున జమ్మి చెట్టుకు పూజలు చేస్తే ఏం జరుగుతుంది మన పురాణాల ప్రకారం జమ్మి చెట్టుకి ఎందుకు పూజ చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

మన పురాణాల ప్రకారం జమ్మి చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది..జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎంతోమంది ఋషులు, మహర్షిలు, పరమశివుడికి, జగన్మాత దుర్గాదేవికి, వినాయకుడికి యజ్ఞాలు యాగాలు వంటివి చేసేటప్పుడు జమ్మి చెట్టు కొమ్మలను ఉపయోగించి అగ్నిగుండంగా మారుస్తూ ఉంటారు. ఇలా అగ్నితోనే హోమాన్ని మొదలు పెడుతూ ఉంటారు. జమ్మి చెట్టుని పూజిస్తే పాపాలు తొలగిపోతాయని పండితులు సైతం తెలియజేస్తున్నారు.

మన పూర్వకాలంలో చాలామంది జమ్మి చెట్టు పైన వస్తువులను భద్రపరిచే వారట.వీటిని శత్రువుల నుంచి జమ్మిచెట్టే కాపాడుతూ ఉండేదని నమ్మకం. అందుకే మహాభారతంలో అర్జునుడు కూడా తన బాణాన్ని జమ్ము  చెట్టులో దాచి పెడతారు. అందుకే దసరా పండుగ రోజున చాలామంది ఆయుధాలు పూజ చేసుకొని మరి ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే రాముడు యుద్ధానికి బయలుదేరినప్పుడు కూడా జమ్ము చెట్టుని పూజించుకునే మరి వెళ్లారట అందుకే విజయదశమి రోజున జమ్మి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉన్నది. దసరా పండుగ రోజున జమ్మిచెట్టు వద్ద చాలామంది దేవతలు పూజలు చేస్తారని అందుకే అమ్మవారి కృప అందరికీ కలగాలని జమ్మి చెట్టుని పూజించమని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా జమ్మి చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జమ్మి చెట్టుని పూజించడం వల్ల సువర్ణ వర్షం కూడా కురుస్తుందట. జమ్మి చెట్టుని పూజించిన తర్వాత అ ఆకులను ఇంట్లో పూజా స్థలంలో ఉంచితే ధన ప్రాంతం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: