కింగ్ కోబ్రాలు ఎలా పుడతాయో తెలుసా.. వీడియో వైరల్?

praveen
సాధారణంగా పాములంటే ప్రతి ఒక్కరికి భయమే. తమకు పాములంటే భయం లేదని ఎంతోమంది పైపైకి కాస్త గంభీరంగా నటించిన.. లోలోపల మాత్రం వణికి పోతూ ఉంటారు అన్నది అందరికీ తెలిసిన నిజమే. దానికి తోడు ఇక కోబ్రా అనే పేరు వినిపించింది అంటే చాలు వెన్నులో వణుకు పడుతూ ఉంటుంది  అలాంటిది ఇక కింగ్ కోబ్రా పేరు వినిపిస్తే ఇక ఆ పాము కాటు వేయడం ఏమో కానీ దాని భయంకరమైన ఆకారాన్ని చూస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి.. ఇలా భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన జీవులలో కింగ్ కోబ్రా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.

 దీని విషం ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కింగ్ కోబ్రా రూపం కూడా అంతే భయంకరంగా ఉంటుంది. మెరుపు వేగంతో దాడి చేసి మనుషుల ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది కింగ్ కోబ్రా. ఇక ఇలా కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే..ఇప్పుడు కూడా ఇలాంటి వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో ఒక కింగ్ కోబ్రా పడగ విప్పి బుసలు కొడుతుంది.

 కానీ ఆ కింగ్ కోబ్రా కి బుసలు కొట్టడం కూడా సరిగ్గా రావడం లేదు. ఊరుకోండి బాసు.. అక్కడున్నది కింగ్ కోబ్రా అంటున్నారు. దానికి బుసలు కొట్టడం రాకపోవడం ఏంటి జోక్ చేస్తున్నారా అంటారా.. జోక్ కాదు నిజమే. అయితే ఇక్కడ వీడియోలో వైరల్ గా మారిపోయింది. భారీ ఆకారంలో ఉన్న భయంకరమైన కింగ్ కోబ్రా కాదు. అప్పుడే గుడ్డులో నుంచి బయటికి వచ్చి  లోకాన్ని చూస్తున్న చిన్ని కోబ్రా. కింగ్ కోబ్రాలు పుట్టగానే పడగా విప్పుతాయి అని ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఓహో కింగ్ కోబ్రాలు ఇలా పుడతాయా అంటూ ఎంతో మంది ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: