ఓరి నాయనో.. ఇలాంటి సీన్లు సినిమాల్లో కూడా చూసుండరు.. వైరల్ వీడియో?

praveen
సోషల్ మీడియా రాజ్యమేలుతున్న తరుణంలో అనునిత్యం ఇక్కడ కొన్ని రకాల వీడియోలు వైరల్ అవుతూ జనాలను అలరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొన్నిసార్లు కొందరు చేసే పనులకు సంబందించిన వీడియోలు మనల్ని ఆశ్చర్యంలో ముంచేస్తాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. సినిమాలోని సీన్లు మనకి గుర్తుకొస్తుంటాయి. అటువంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
విషయం ఏమిటంటే, ఓ వ్యక్తి బావిలో నుంచి కొండచిలువలను బయటి తీయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ... రెండు భారీ కొండచిలువలు ప్రమాదవశాత్తు ఓ బావిలో చిక్కుపోయి, బయటికి రాలేక నానాతంటాలు పడుతున్నాయి. కాగా బావిలో వింత శబ్ధాలను గమనించిన స్థానికులు అక్కడ గుమికూడారు. చివరకు అంతా కలిసి వాటిని రక్షించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారిలో ఓ వ్యక్తి బావిలోకి దిగి, నీటిలో మునిగిపోయిన కొండచిలువను వెతకడం స్టార్ట్ చేశాడు.
కట్ చేస్తే, ఆ వ్యక్తి ఓ భారీ కొండచిలువను వెతికి చేతితో పట్టుకొని మరీ దాన్ని అతి కష్టం మీద నీటి పైకి తెచ్చి, బావి పైన ఉన్న వారికి అందించాడు. కొండచిలువ భారీగా ఉండడంతో బయటికి తీయడం వారికి చాలా కష్టతరమైంది. ఎలాగోలా బయటికి లాగే ప్రయత్నం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మళ్లీ నీటిలో పడిపోయింది ఆ కొండచిలువ. దీంతో నీటిలో ఉన్న వ్యక్తి మళ్లీ ఎలాగోలా కొండచిలువను బయటకి లాగి మరీ వారికి అందించాడు. ఆ తర్వాత నీటిలో ఉన్న మరో కొండచిలువను కూడా ఇలాగే బయటికి తీసేందుకు ట్రై చేసాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ''వామ్మో.. ఈ సీన్ చూస్తుంటేనే భయమేస్తోంది... సినిమాలలోనే ఇలాంటి విన్యాసాలు చేస్తారు.. ఇతను నిజంగా సూపర్!''.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: