వైరల్: ఈడేవడండి బాబు..చేసిన పనికి నవ్వాపుకోలేకపోతున్న నెటిజన్స్.!

FARMANULLA SHAIK
కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొన్ని సంఘటనలు మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి ఆశ్చర్యకర ఘటనలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సంఘటలనకు సంబంధించిన వీడియోలన్నీ ఆ మరుక్షమే నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో మీలో చాలా మందికి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమైనా చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఊహించని ప్రమాదాలు చోటు చేసుకునే వీలుంది. ఇదిలావుండగా బైక్ డ్రైవింగ్ సమయంలో చాలా మంది వినూత్న విన్యాసాలు చేయడం చూస్తుంటాం. కొందరు బైకుపై నిలబడి డ్రైవ్ చేస్తే.. మరికొందరు స్పైడర్ మ్యాన్ తరహాలో బండికి వేలాడుతూ వెళ్తుంటారు.ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి బైకుపై రివర్స్ రైడ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే చివరకు జరిగిన ఘటనతో కంగుతిన్నాడు. 

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో బైకుపై వెనక్కు తిరిగి కూర్చున్న ఆ వ్యక్తి.. రెండు చేతులతో హ్యాండిల్‌ను పట్టుకున్నాడు. బైకును స్టార్ట్ చేసి ముందుకు నడపాలని ఫిక్స్ అయ్యాడు. ఇంతవరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే తమాషా సంఘటన చోటు చేసుకుంది. వెనక్కు తిరిగి కూర్చున్న ఆ వ్యక్తి బైక్‌ను స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసి, ఎక్సలేటర్ రైజ్ చేస్తాడు. అయితే బైకు కాస్త ముందుకు వెళ్లగానే బ్యాలెన్స్ చేయలేక ధబేల్‌మని కిందపడిపోతాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వుకుంటారు.కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''రివర్స్ రైడింగ్ చివరకు రివర్స్ అయిందిగా''.. అంటూ కొందరు, ''ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే ఇలాగే జరుగుతుంది''.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: