ఈ ఏడు రంగుల పర్వతం గురించి తెలుసా.. ఇది ఎక్కడ ఉందంటే?

praveen
ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. అయితే ఇక నేటి రోజుల్లో సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలోని వింతలు విశేషాలు అన్నిటిని కూడా అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే తెలుసుకోగలుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలాంటి ప్రకృతి అందాలు సోషల్ మీడియాలోకి వచ్చి అందరిని అబ్బుర పరుస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి ప్రకృతి సౌందర్యాలు కూడా ఈ భూమ్మీద  ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.

 ఇక అలాంటి ప్రకృతి అందాలను చూసి తెగ ఆనంద పడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒక్కసారైనా అలాంటి ప్రదేశాలకు వెళ్లాలని తెగ ఆశపడుతూ ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ప్రదేశం గురించే. అది ఒక పెద్ద పర్వతం. పర్వతం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఎత్తు. ఇక పర్వతాలు అంటేనే భారీ ఎత్తులో ఉంటాయని.. చాలామంది పర్యటకులు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పర్వతం మాత్రం ఒక అందమైన ప్రకృతి సౌందర్యం.

 ఎందుకంటే ఇప్పటివరకు పర్వతాలు ఎలా ఉంటాయో అందరూ చూసే ఉంటారు. కానీ ఇది ఏకంగా రంగురంగుల పర్వతం. హరివిల్లును తలపించే విధంగా ఈ పర్వతం కనిపిస్తూ ఉంటుంది. ఏకంగా 5200 మీటర్ల ఎత్తు అయినా ఈ పర్వతం ఏడు రంగులలో కనిపిస్తూ ఉంటుంది. పెరులో ఉండే ఈ పర్వతం పేరు విని కుంక. విభిన్న ఖనిజాల కారణంగా ఇక్కడ పర్వతంపై ఏడు రంగులు కనిపిస్తూ ఉంటాయి అని పరిశోధకులు చెబుతున్నారు. కక్సో ప్రాంతం నుంచి దీన్ని చూసేందుకు వెళ్లొచ్చు. శిఖరం ఎక్కిన తర్వాత కొండ అసలు అందరం ఆవిష్కృతం అవుతుంది. స్థానికులు దీన్ని భూమాతకు ప్రతిరూపంగా పవిత్రంగా భావిస్తూ ఉంటారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: