అవగాహన పెంచేందుకు.. నుదుటిపై పాముతో కరిపించుకున్నాడు.. చివరికి?

praveen
పాములు అంటే ప్రతి ఒక్కరికి కూడా భయమే. మనిషి ఆకారంతో పోల్చి చూస్తే పాముల ఆకారం చిన్నగానే ఉన్నప్పటికీ.. కేవలం ఒక్క కాటుతో ఆరడుగుల మనిషిని నేల కూల్చి ప్రాణాలు తీయగలవు పాములు. అందుకే పాములను చూస్తే మనుషులు వణికిపోతూ ఉంటారు. ఏకంగా వాటి జోలికి వెళ్లేందుకు కూడా తెగ భయపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కళ్ళ ముందు కనిపించేది విషపూరితమైన పాములు కావు అని తెలిసినప్పటికీ ఎందుకో పాము కనిపిస్తే తెలియకుండానే ఒంట్లో భయం పుట్టుకొస్తూ ఉంటుంది.
Your browser does not support HTML5 video.
 అయితే ఇలా భయం కలిగిన సమయంలో కొంతమంది ఏకంగా విషపూరితము కాని పాములను సైతం ఏకంగా దారుణంగా కొట్టి చంపడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా పాములను కొట్టి చంపకుండా ఏకంగా వాటిని సంరక్షించేందుకు ఎంతో మంది స్నేక్ క్యాచర్లు ప్రయత్నిస్తూ ఉంటారు. జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాలలో వదిలేయడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి  ఇంకొంతమంది ఇక పాముల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేశాడు. ఏకంగా పాము పై అవగాహన తీసుకురావాలి అనే ఉద్దేశంతో పాముతోనే కాటు వేయించుకున్నాడు.

 ఇండోనేషియా కు చెందిన బెజాక్ సి ఆరెండ్ పాములు సంరక్షణకు పాటుపడుతూ ఉంటాడు. అక్కడి జావా దీవుల్లో పచ్చ రంగు బురద పాములు ప్రమాదరహితమైనప్పటికీ కూడా స్థానికులు వాటిని చూసి చంపేస్తూ ఉంటారు. దీంతో ఇక అక్కడి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఏకంగా రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు బెజాక్. ఈ క్రమంలోనే అక్కడి బురద పాముల్లో ఒకదానితో నుదుటిపై కరిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఎంత విషరహితమైనప్పటికీ పాముతో ఇలా కనిపించుకోవడమేమిటి అని అందరూ ఈ వీడియో చూశాక షాక్ లో మునిగిపోతున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: