దేవరలో గ్రాఫిక్స్.. కానీ ఇది రియల్.. సొర చేపపై స్వారీ చేసాడు?

praveen
సముద్రంలో వివిధ రకాల అడ్వెంచర్ క్రీడలు చాలా ఫేమస్. సర్ఫింగ్, స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ లాంటివి చాలామందికి ఇష్టమైన క్రీడలు. కానీ కొంతమంది మాత్రం ఈ క్రీడల్లో భాగంగా చాలా ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తుంటారు. ఇలాంటి క్రీడలు మన శరీరాన్ని బలంగా చేయడంతో పాటు మనసుకు కూడా చాలా ఆనందాన్నిస్తాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఒక వ్యక్తి షార్క్ వేల్‌పై ఎక్కేసి ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఈ వ్యక్తి చేసిన పని చాలా మూర్ఖంగా ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. వీడియోలో సొర చేప ఒక బోటు దగ్గరకు వచ్చింది. అప్పుడు ఆ బోటులో ఉన్న ఒక వ్యక్తి సొర చేప మీద ఎక్కి కూర్చున్నాడు. ఆశ్చర్యకరంగా ఆ షార్క్ వేల్‌ ఇంతకు ముందు ఎన్నో సార్లు ఇలా మనుషులను మోసుకెళ్లిన దానిలాగా ఈ వ్యక్తిని తన వెంట తీసుకుని వెళ్ళింది. బోటులో ఉన్న మిగతా వ్యక్తులు అతనిని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టారు. కానీ తరువాత ఏమైందో వీడియోలో స్పష్టంగా తెలియదు.
సోషల్ మీడియాలో @amazingnature అనే ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఎక్కడ ఆ వ్యక్తి సొర చేప ఎక్కేసి స్వారీ చేశాడో తెలియ రాలేదు కానీ ఈ సీన్ చూస్తే మనకు రీసెంట్‌గా ఎన్టీఆర్ నటించిన దేవర మూవీనే గుర్తుకొస్తుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక సొర చేప మీద స్వారీ చేస్తాడు. అది కేవలం రీల్ మాత్రమే కానీ ఇతను చేసింది మాత్రం రియల్. వీడియోను చాలా మంది చూశారు. చాలా మంది ఈ వ్యక్తి చేసింది చాలా మూర్ఖత్వపు పని అని అందరూ అభిప్రాయపడుతున్నారు. సొర చేప అకస్మాత్తుగా కోపగించుకుంటే ఆ వ్యక్తి ప్రాణం ఎంతో ప్రమాదంలో పడి ఉండేదని కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేసి సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చాలామంది ప్రయత్నిస్తున్నారని కూడా కొంతమంది అంటున్నారు.
ఇలాంటి మరో సంఘటన బెంగళూరులో జరిగింది. ఒక వ్యక్తి తన స్నేహితులతో బెట్టింగ్ చేసి టపాసుల బకెట్ మీద కూర్చున్నాడు. ఆ టపాసులు పేలి ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ సంఘటన చాలా మందికి షాక్ ఇచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఈ సంఘటన స్పష్టంగా తెలియజేస్తుంది.
https://x.com/AMAZlNGNATURE/status/1857320728435023898?t=alC-vLWTlmCKeiELYUw9Rw&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: