ఆంధ్రాలో మాత్రమే కనిపించే అరుదైన విలేజ్.. దేశంలోనే లేదు.. ఎక్కడంటే..?
ఈ ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖ లింగ క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్న కూర్మా గ్రామం.. ఈ గ్రామంలో ఎక్కువగా ఆధ్యాత్మిక భావన ఉంటుందట. మొత్తం మీద 56 మంది ఈ గ్రామంలో నివసిస్తున్నారట. ప్రాచీన గ్రామీణ పద్ధతులు గురుకుల జీవన విధానాన్ని ఈ గ్రామం నిలిచేలా చేస్తోందట. ఆధునిక కాలానికి ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం పల్లె జీవనాన్ని సాగిస్తోంది. ఇక్కడ ప్రాంతం చూస్తే 100 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టుగా ఉంటుందట .మట్టి, ఇసుక సున్నంతోనే ఇక్కడ ఇల్లులు నిర్మించబడుతూ ఉంటాయి. ఇక్కడ ఇళ్లకు సిమెంటు ఇనుమును ఏ మాత్రం అసలు ఉపయోగించారట.
అలాగే ఒకప్పటి ప్రాచిన పద్ధతులలోనే వ్యవసాయం చేస్తూ ఉంటారట. యంత్రాలు రసాయనాలు అవసరం లేకుండానే పంటను సాగు చేస్తూ ఉంటారట. అక్కడ ఉన్నవారు రోజుకి సదుపాడే కూరగాయలను కూడా పండించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సమాజంలో అవసరమయ్యే గురువు, రైతు బట్టలు నేసే వారు వడ్రంగి ఇలా ఎవరికి వారి అభిరుచి విషయంలో పని చేసుకుంటూ ఉంటారట. ఒకప్పుడు పండించిన బ్లాక్ రైస్ రెడ్ రైస్ వంటివి కూడా ఇక్కడ పండిస్తూ ఉన్నారట. డబ్బులతో పని లేకుండానే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. విత్తనం నాటినప్పటి నుంచి కోత వచ్చేవరకు సొంతంగానే పండిస్తారట. ఇక్కడ బట్టలను ఉతకడానికి కుంకుడుకాయ రసాన్ని ఉపయోగిస్తారట. అక్కడ పిల్లలకు రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇతరత్రా పురాణాలలో ఉండేటువంటి వేదాలు ఇతిహాసాలను మాత్రమే నేర్పుతున్నారట.
ఇక్కడ కరెంటు అసలు ఉండదు ఫ్యాన్లు, టీవీలు అసలు కనిపించవు విద్యుత్ సౌకర్యాలు కూడా ఉండవు వీటన్నిటికీ కావాలి అంటే డబ్బు అవసరమని వీటన్నిటిని దూరం పెట్టారట. దేశ విదేశాల నుంచి చాలామంది వీరిని చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కూర్మ గ్రామంలో వసతి భోజనం అంతా కూడా ఉచితమేనట. అయితే ఇక్కడ వారు నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఉదయం 3:30 కే నిద్రలేచి తమ పనులను తాము చేసుకుంటూ ఉంటారట.