మొబైల్ వాడుతూ బైక్ నడిపేవారు.. తప్పకుండా ఈ వీడియో చూడండి?

praveen
నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో బ్రతికేస్తున్నాడు మనిషి. ఒకసారి ఒక పని చేయడం కాదు ఏకంగా రెండు పనులను చేయడానికి ఇష్టపడి పోతున్నాడు. కానీ కొన్ని కొన్ని సార్లుఇలా ఒకేసారి రెండు పనులు చేయాలి అని సాహసాలు చేసి చివరికి ప్రమాదాల బారిన పడుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో బైక్ నడుపుతున్న సమయంలో మొబైల్ మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరికి ఒక అలవాటుగా మారిపోయింది. ఇలా వాహనం నడుపుతూ మొబైల్ మాట్లాడటం చట్టరిత్య నేరమని.. అలాంటి అలవాటు ప్రమాదంలో పడేస్తుంది అన్న విషయం తెలిసినప్పటికీ.. ఎంతోమంది ఇలా బైక్ నడుపుతూ మొబైల్ వాడే అలవాటును మాత్రం మార్చుకోవడం లేదు.

 ఇక ఇలాంటి అలవాటుతోనే ఎంతోమంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా మొబైల్ నడుపుతూ వాహనాలు నడపడం వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయి అన్నదానికి సంబంధించిన వీడియోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. ఒకవేళ మీకు కూడా మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపే అలవాటు ఉంటే మాత్రం.. మీరు కూడా తప్పకుండా ఈ ఘటన గురించి తెలుసుకోవాల్సిందే. ఒక స్కూటర్ డ్రైవర్ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ.. బైక్ నడిపి చివరికి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు.

 కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో కారు డాష్ కెమెరాలో రికార్డు కావడంతో.. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఒక మలుపు దగ్గర యువకుడు ఒక చేత్తో బైక్ నడుపుతూ.. ఇంకో చేత్తో మొబైల్ చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అయితే ఇలా మలుపును తీసుకోవడంలో అతను విఫలమయ్యాడు. దీంతో మరోవైపు నుంచి వస్తున్న కారును అతను ఢీకొట్టాడు. ఏకంగా కారు ముందు భాగంలోకి వెళ్లి అతని తల బలంగా తాకింది. దీంతో ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు అన్నది తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా..  మొబైల్ మాట్లాడుతూ వాహన నడిపితే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నదానికి ఈ ఘటన నిదర్శనంగా మారింది అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: