కృత్రిమ గుండె కొట్టుకోవడం ఎప్పుడైనా చూసారా.. వైరల్ వీడియో?
విషయం ఏమిటంటే, ఈ క్రమంలోనే ఒక హార్ట్ ఫెయిల్యూర్ బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతగాడికి కృత్రిమ గుండెని అమర్చి డాక్టర్లు ప్రాణాలు కాపాడారు. కాగా ఆ కృత్రిమ గుండెకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళితే, ఒక హార్ట్ ఫెయిల్ అయిన వ్యక్తికి అమర్చిన వి ఏ డి (వెంట్రుక్యులర్ అసిస్ట్ డివైస్) ఇతర శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేసే విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది అతని శరీర భాగానికి వెలుపల వైపు అమర్చగా, అది అచ్చం నిజమైన గుండె కొట్టుకున్నట్టే మనకి కనబడుతోంది. దాంతో ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా జనాలు రకరకాల కామెంట్లు చేయడం మనం గమనించవచ్చు.
సాధారణంగా ఆరోగ్యవంతుని హృదయం నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. అలా కొట్టుకోవడంలో ఏదైనా తేడా జరిగినప్పుడు హార్ట్ ఎటాక్స్ వంటివి సంభవిస్తాయి. ఒకవేళ అలాంటి ప్రమాదాలు మీ చుట్టూ ఎప్పుడైనా జరిగినట్లయితే, అనవసరంగా కంగారు పడకుండా ముందుగా సదరు బాధితుడికి సి పి ఆర్ చేస్తే చాలా మేలు చేసిన వారు అవుతారు. అలా చేసిన తర్వాత హాస్పిటల్ కి తరలిస్తే సదర వ్యక్తి ప్రాణాల నుండి బయట పడే అవకాశం మెండుగా ఉంటుంది. ఇక సి పి ఆర్ ఎలా చేయాలో చెప్పడం కోసం అనేక వైద్య బృందాలు ఇప్పుడు ఉచిత సేవలను కొనసాగిస్తున్నాయి. దీనికి అనుభవం అవసరం లేదు. మీలో ఎవరైనా చేయొచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చి ఒక వ్యక్తి కింద పడిపోయినట్లయితే, ముందుగా ఆ వ్యక్తి చాతి పైన మీ ఎడమ చేతిని ఉంచి, రెండు వేళ్ళతో నొక్కిపెట్టి, మిగిలిన చేయని ఆ రెండు వేళ్ళ పైన ఉంచి కాస్త అదిమినట్లయితే, బాధితుని హార్ట్ రేట్ రెగ్యులేట్ కావడం జరుగుతుంది. దాంతో అతని ప్రాణాలను రక్షించిన వారు అవుతారు