తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. లిఫ్ట్ లోకి వెళ్లిన చిన్నారి.. చివరికి?
కాగా తాజాగా, ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ పిల్లాడు ఒంటరిగా ఆడుకుంటూ ఆడుకుంటూ లిఫ్ట్ లోకి వెళ్లాడు. మొదట ఇంట్లో నుంచి బయటికి వచ్చి తోటి పిల్లలతో ఆదుకోవడం ఇక్కడ గమనించవచ్చు. తరువాత ఒక్కడే అక్కడ ఉన్న ఓ లిఫ్ట్‌లోకి వెళ్లాడు. లోపలికి వెళ్లగానే లిఫ్ట్ డోర్స్ ఒక్కసారిగా మూసుకుపోయాయి. ఆ తర్వాత ఆ పిల్లాడు లోపల ఉన్న ఫ్లోర్ నంబర్లను ఒక్కొక్కటిగా నొక్కడంతో లిఫ్ట్ నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లిపోతుంది. ఇక అప్పటిదాకా సంతోషంగా ఉన్న పిల్లాడు.. ఆ తర్వాత తాను ఏదో ప్రమాదం ఉన్నాడని భ్రమపడి ఒక్కసారిగా గుక్క పట్టి ఏడుస్తాడు.
ఈ క్రమంలో లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్లీ పై అంతస్తులోకి మరలా వచ్చేస్తుంది. పోకిరి సినిమాలోగా లిఫ్ట్ ఆటలాగా ఈ వీడియో అనిపిస్తుంది కానీ, అందులో ఎరక్కపోయి ఇరుక్కుపోయిన ఆ పిల్లాడు మాత్రం నానా నరకయాతన పడతాడు పాపం. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ కాగా సదరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహిస్తే ఇలాగే జరుగుతుంది!" అంటూ కొందరు కామెంట్ చేస్తే, ''తల్లిదండ్రులు పిల్లలను క్షణం క్షణం కనిపెట్టుకుని ఉండాలి'' అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1500కి పైగా లైక్‌లు, 3.5 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవడం ఇక్కడ గమనించవచ్చు.