జెయింట్ వీల్ నుంచి జారి పడిన బాలిక.. వీడియో వైరల్?
చాలా ఎత్తులో ఆ బాలిక వేలాడుతూ ఉండటం గమనించిన వారంతా తీవ్ర ఆందోళన చెందారు. సదరు టీనేజర్ అదృష్టవశాత్తూ ఒక కడ్డీని గట్టిగా పట్టుకుంది. అంత ఎత్తులో అలా వేలాడుతూ ఉంటే ఎవరికైనా గుండెల్లో తీవ్ర భయం కలుగుతుంది. భయమే అక్కడి నుంచి కిందపడేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ ఈ బాలిక మాత్రం చాలా ధైర్యంగా దానిని పట్టుకొని ఉండగలిగింది. కింద ఉన్న వాళ్ళు ఈ విషయం గమనించి వెంటనే ఆ వీల్ ఆపి, ఆ బాలికను సురక్షితంగా కిందకు దింపారు.
ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత దీన్ని చూసి చాలా మంది ఈ రకమైన జైయంట్ వీల్స్ పట్ల భయం వ్యక్తం చేశారు. ఒకరు, "నేను చిన్నప్పటి నుండి స్వింగ్స్ ఎక్కాలంటేనే చాలా భయపడతాను. ఇప్పుడు ఈ వీడియో చూశాక ఇక ఎప్పుడూ స్వింగ్స్ లేదా వీల్స్‌కి దగ్గరకు కూడా వెళ్లలేను" అని కామెంట్ చేశారు. మరొకరు, "ఆమె సూపర్‌గర్ల్ సినిమా కోసం ట్రైన్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఎత్తులకు భయపడే నాకు ఇంకా ఎక్కువ భయం వేస్తోంది" అని జోక్ చేశారు.
ఫెర్రిస్ వీల్ ప్రమాదంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనలో బాలిక సురక్షితంగా ఉందని సబ్ డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ రాజీవ్ నిగమ్ తెలిపారు. అలాగే, అనుమతి లేకుండా ఫెర్రిస్ వీల్ నిర్వహించిన వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దర్యాప్తు జరుగుతోంది.