పేరుకే 12th స్టూడెంట్.. కానీ ఏం కనుగొన్నాడో తెలిస్తే షాకే?
చైనా డ్రోన్లను చూసిన తర్వాత తాను మనుషులను తీసుకుపోయే డ్రోన్‌ను తయారు చేయాలని నిర్ణయించుకొని కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. "MLDT 01" అని పేరు పెట్టబడిన ఈ డ్రోన్ 80 కిలోగ్రాముల బరువున్న వ్యక్తిని ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకెళ్లగలడు. అంతేకాకుండా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణించగలదు. నివేదికల ప్రకారం, సదరు ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ఆ కుర్రాడికి దాదాపుగా రూ. 3.5 లక్షలు ఖర్చు అయిందని సమాచారం. ఇక ఆ టోటల్ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి 3 నెలలు సమయం పట్టిందని వినికిడి.
MLDT 01 డ్రోన్ ఫీచర్ల విషయానికొస్తే... 1.8 మీటర్ల పొడవు కలిగి, 3.5 వెడల్పును కలిగి ఉన్నట్టు సమాచారం. సాధారణంగా వ్యవసాయ డ్రోన్లలో ఉపయోగించే 4 మోటార్ల ద్వారా ఇది శక్తిని పొందుతుంది. 45-హార్స్పవర్ కెపాసిటీతో, ఇది ఆరు నిమిషాల పాటు ఏకధాటిగా ఎగరగలదు. భద్రతా కారణాల దృష్ట్యా, డ్రోన్ ప్రస్తుతం 10 మీటర్ల ఎత్తు వరకు ఎగరడానికి పరిమితం చేసినట్టు తెలుస్తోంది. మున్ముందు, మేధాన్స్ ఈ డ్రోన్‌ను హైబ్రిడ్ మోడల్‌కి అప్‌గ్రేడ్ చేయాలని మరియు జనాలకి అందరికీ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆ కుర్రాడు మాట్లాడుతూ... "భవిష్యత్తులో, నేను సాధారణ ప్రజలకు ఉపయోగపడే డ్రోన్లను తయారు చేస్తాను, ఇది వస్తువులను తీసుకెళ్లడానికి, ఒక వ్యక్తిని మరొక ప్రదేశానికి రవాణా చేయడానికి మరియు వ్యవసాయంలో సేవలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది" అని చెప్పుకొచ్చాడు.