గంటో రెండు గంటలో కాదు.. 3 ఏళ్ళు ఆలస్యమైన ఈ రైలు గురించి తెలుసా?

praveen
"నువ్వెక్కల్సిన బస్సు జీవితకాలపు లేటులా ఉంది!" అని నానుడి. అంటే ప్రయాణికులు తాము వెళ్లాల్సిన బస్సుకోసం వెయిట్ చేసినపుడు, సమయం ఒక గంట కంటే ఎక్కువ కాలం తీసుకుంటే అపుడు ఈ నానుడిని సరదాగా ప్రయోగించేవారు. ఆ నానుడి ఇపుడు ఓ ట్రైన్ విషయంలో రుజువు అయ్యింది. అవును, సాధారణంగా రైలు అనేది పదిహేను నిమిషాలు లేదా ఓ గంట వరకు ఎక్కడైనా కొన్ని అనివార్య కారణాల వలన ఆలస్యమవుతుంది. కానీ ఇక్కడ 42 గంటల్లో చేరాల్సిన ఓ రైలు.. సరిగ్గా 3 సంవత్సరాలుకు తన గమ్యస్థానాన్ని చేరుకుంది అంటే మీరు నమ్ముతారా?
నిజం, భారతీయ రైల్వే చరిత్రలోనే ఇది అత్యంత ఆలస్యంగా పయనించిన రైలుగా రికార్డులోకి ఎక్కింది. 2014వ సంవత్సరం నవంబర్‌లో విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ స్టేషన్‌ చేరాల్సి ఉంది. 1,400 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల వ్యవధి పట్టగా ఈ ట్రైన్ అక్కడికి చేరుకోవడానికి ఏకంగా మూడున్నరేళ్లు సమయం తీసుకుంది. ఈ రైలులో 14 లక్షల రూపాయల విలువైన 1,361 ఎరువుల ప్యాకెట్లు ఉన్నాయి. వీటిని వ్యాపారవేత్త రామచంద్ర గుప్తా బుక్ చేసుకోగా 2014 నవంబర్‌లో అనుకున్న విధంగా రైలు గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో అనుమానమొచ్చి గుప్తా.. రైల్వే అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అంతేకాదండోయ్... రైలు ఎక్కడుంది? అనే జాడ కూడా ఎవ్వరికీ తెలియలేదు. ఇలా ఇన్వెస్టిగేషన్ కొన్నేళ్లు సాగగా ఈ క్రమంలో పోలీసులు అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేశారు. ఇన్ని జరిగిన తర్వాత సరిగ్గా మూడున్నరేళ్ల తర్వాత రైలు 2018 జూలైలో బస్తీ స్టేషన్‌కు చేరుకుంది. అప్పటికి ఎరువు ఎందుకూ పనికి రాకుండా పోవడంతో సదరు రైతు వాపోయాడు. అయితే విచారణలో మాత్రం రైలు ఎందుకు ఆలస్యమైంది, ఎలా అదృశ్యమైంది అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాకపోవడం కొసమెరుపు. కాగా, ఈ సంఘటన భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత దారుణ ఘటనగా మిగిలిపోయింది. కాగా ఈ ఘటన రైల్వే వ్యవస్థలోని లోపాళ్లను హైలైట్ చేయడంతో అధికారులు ఒకింత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: