సింహాన్ని లాక్కెళ్ళిన రాకాసి 'డేగ'.. వీడియో చూస్తే గాని అస్సలు నమ్మలేరు?
ఇక సోషల్ మీడియా బాగా ప్రబలిన తరువాత అనేక రకాల డేగ విన్యాసాలను మనం చూడగలుగుతున్నాము. మరీ ముఖ్యంగా డేగలు, పెద్ద పెద్ద జంతువులను సైతం ఎత్తుకెళ్లగలవు అనే విషయాన్ని మనం సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాము. ఈ క్రమంలోనే మరో వీడియో ఒకటి జనాలను అబ్బురపరుస్తోంది. విషయం ఏమిటంటే.. ఆ మధ్య పెద్ద డేగ ఒకటి పెద్ద కొండపై జింకను లాక్కెళ్లి, అక్కడినుండి కింద విసిరేసి మరీ ఎంజాయ్ చేసిన వైనాన్ని ఇంకా మర్చిపోక మునుపే మరో వీడియో ఇపుడు జనాలకి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. డేగ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ డేగ పెద్ద సింహాన్ని లాక్కెళ్తున్నట్లుగా ఆ వీడియోలో రికార్డ్ కావడంతో అంతా అవాక్కవుతున్నారు.
కాగా ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. విషయంలోకి వెళితే... సముద్రం మీదుగా దూసుకెళ్తున్న డేగ.. తన కాళ్లతో సింహాన్ని గట్టిగా పట్టుకుని తినడానికి తన గూటికి ఎగరేసుకు పోతోంది. ఇక అడవికి రాజు అని చెప్పుకుంటున్న సింహమేమో దాన్నుంచి విడిపించుకోవడానికి నానా తంటాలు పాడడం ఇక్కడ వీడియోలో చూడవచ్చు. అయితే చూస్తుండగానే ఆ డేగ.. సింహాన్ని కోడి పిల్లలా ఎగరేసుకెళ్లి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించింది. ఈ సీన్ చూస్తుంటే.. ఇదేదో గ్రాఫిక్స్ చేసినట్లుగా అనిపిస్తున్నా సదరు వీడియో మాత్రం రియల్ అని జనాలు అంటున్నారు. కాగా ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించడం ఇక్కడ చూడవచ్చు. ‘‘చాలా బరువైన సింహాన్ని ఎత్తుకెళ్లడం అసాధ్యం... కానీ ఈ దృశ్యం చూస్తే అది పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.