వైరల్: సునామీ విధ్వంసం సృష్టిస్తే అంతేమరి.. భయంకరమైన వీడియో వైరల్..!

Divya
మనిషి మనుగడ ఏంటన్నది ఎప్పటికీ ప్రకృతి మీదే ఆధారపడి ఉంది.. ఒకవేళ ప్రకృతి అనేది ఉగ్రరూపం దాచితే క్షణాలలో అన్నిటినీ కూడా నాశనం చేయగల సత్తా ఉన్నది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో భూకంపాలు సునామీలు వచ్చి చాలా అతలాకుతలం చేశాయి. ఇటీవలే జపాన్ లో ఏకంగా 7.5 శాతం తీవ్రతతో భూకంపం వచ్చిందట. 2011లో జపాన్ లో వచ్చిన బారి భూకంపానికి సంబంధించి పలు రకాల విధ్వంసం సృష్టించినది ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

ఈ వీడియో చూసిన వారందరూ కూడా సునామి ఉగ్రరూపం దాల్చితే ఇలా ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. నిజానికి మార్చి 11- 2011 ఉదయం ఈశాన్య జపాన్ లో సముద్రంలో ఏకంగా 9.1 తీవ్రతతో భూకంపం సంభవించిందట. దీని తర్వాతే సునామీ రావడంతో జపాన్ లో ఏకంగా 70 శాతం వరకు క్షణాలలో నీటిలో అంతా మునిగిపోయిందట. తోహుకు సమీపంలో ఉండే సముద్రానికి 72 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో కూడా సునామి కేంద్రం ఉన్నదట..
అయితే ఇక్కడ అధికారులు తెలిపిన ప్రకారం సుమారుగా 20 వేల మంది మరణించారట. అలాగే 6000 మందికిపైగా గాయపడ్డారని వేలాదిమంది ప్రాణాలు నుంచి తప్పించుకుని బయటపడ్డారని తెలిపారు.. అయితే ఈ విపత్తు ఎలా వచ్చిందని విషయంపై AMAZINGNATURE అనే ట్విట్టర్ నుంచి ఒక వీడియో షేర్ చేయబడింది. ఇందులో జపాన్ లో సునామీ విధ్వంసం ఎలా సృష్టించిందో చాలా క్లియర్ గా కనిపిస్తోంది.. సముద్రంలో అలలు సైతం చాలా మందిని చుట్టిముట్టేయడమే కాకుండా వాటి మీద పడవలు కూడా కొట్టుకుపోతున్నాయి. ఒక్క క్షణంలో అక్కడి వాతావరణం మారిపోయి అతలాకుతలం చేసింది నీటి ప్రవాహ వేగం కూడా లెక్కించలేనంత స్పీడుతో వెలుతోంది.. అలాగే ఎన్నో కార్లు ఇల్లు అన్ని కొట్టుకుపోయాయి. ఇక ప్రజలు కూడా తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: