ఆంధ్రాలో కలకలం రేపుతున్న పార్సెల్..ఓపెన్ చేయగానే డెడ్ బాడీ..ఎవరిదంటే..?

Divya
సాధారణంగా కొన్ని సందర్భాలలో ఏదైనా పార్సిల్స్ వచ్చాయంటే చాలామంది భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు.. మరి కొంతమంది వీటివల్ల కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు అలా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఒక పార్సిల్ కలకలాన్ని సృష్టిస్తున్నది. సాధారణంగా పార్సిల్ లో ఎక్కడైనా కానీ వస్తువులకు కానీ ఇతర సామాగ్రి వస్తూ ఉంటాయి. కానీ పశ్చిమగోదావరి జిల్లాలో ఉండి మండలంలో ఒక పార్సిల్ మృతదేహంగా వచ్చిందట. దీన్ని చూసిన వారందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మరి ఆ పార్సల్ కథ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

పూర్తి వివరాల్లోకి వెళితే యండగండిలో ఒక వ్యక్తి డెడ్ బాడీ పార్సల్ గా వచ్చిందట.. అయితే ఈ పార్సిల్ ఆ ప్రాంతంలో జగనన్న కాలనీలో ఉండేటువంటి తులసి అనే మహిళ పేరుతో వచ్చిందట.. అయితే ఇంటి సామాగ్రి తో పాటు ఈ పార్సల్ రావడంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర సంచలనాలని సృష్టించింది. ఈ పార్సల్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లుగా అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు. తులసి యొక్క నిర్మిస్తున్న ఇంటికి సంబంధించిన కొన్ని సామాగ్రిలను క్షత్రియ పరిషత్ నిర్వహకులే సరఫరా చేస్తూ ఉన్నారట.

ఒక ఆటో డ్రైవర్ తులసికి ఫోన్ చేసి తన ఇంటికి సంబంధించిన వస్తువులు పార్సల్ గా వచ్చాయని చెప్పారట. అయితే ఆ మహిళ కూడా ఆ సామాన్లను తీసుకొని ఆరోజు ఉదయం వస్తువులను తెరవగానే ఒక్కసారిగా షాక్కు గురైనట్లు తెలియజేస్తోంది. అయితే ఆ పార్సిల్ లో ఒక వ్యక్తి యొక్క మృతదేహాన్ని చూసి అక్కడ స్థానికులు వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట. ముఖ్యంగా ఈ పార్సిల్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. అలాగే ఆ పార్సెల్ తెచ్చిన వ్యక్తి కదలికల పైన కూడా పోలీసులు నిగా పెట్టినట్టు సమాచారం. కానీ ఈ పార్సెల్ పైన ఇప్పటికే పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులు విచారిస్తున్నారట. మొత్తానికి ఆంధ్రాలో ఈ పార్సెల్ కొరియర్ అనేది ఇప్పుడు ఒక సంచనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: