వైరల్: ప్రియురాలి మోజులో ఉద్యోగి.. ఏకంగా 21 కోట్లతో..?

Divya
ఒక యువకుడికి కేవలం నెలకు 13వేల జీతంతో  రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కేవలం కంప్యూటర్ ఆపరేటర్ గా ఉన్నారట.. కానీ తను చేసిన పని వల్ల సుమారుగా 21.6 కోట్ల రూపాయలు దోచేశాడట. ఈ విషయం విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.. అంతేకాకుండా ఈ డబ్బుతో ఖరీదైన కార్లు బైకులు కొనడమే కాకుండా తన ప్రియురాలు కోసం ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి గిఫ్ట్ గా ఇచ్చారట. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఈ విషయం విని ఆశ్చర్యపోయారట.

అసలు విషయంలోకి వెళ్తే హర్షల్ కుమార్ క్షిరసాగర్ 23 ఏళ్ల యువకుడు శంబాజీ నగర్ లో ఉండేటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తూ ఉన్నారట. అయితే నకిలీ ఈమెయిల్ కాతాను ఓపెన్ చేసి ఆ సంస్థ బ్యాంకు అకౌంట్ లో నుంచి డబ్బులు కాజేస్తూ ఉండేవాడట. అలా సుమారుగా జూలై ఒకటి నుంచి డిసెంబర్ 7వ తేదీ మధ్యలోనే 21.6 కోట్ల రూపాయలు కొనుగోలు చేసినట్లు సమాచారం. అలా మొత్తం 13 బ్యాంకుల అకౌంట్లకు ఈ డబ్బులను బదిలీ చేశారట.

అయితే హర్ష పూర్తి ప్లాన్ ప్రకారం బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసేందుకు ప్రణాళికను వ్యవహరించారట.. బ్యాంకు అకౌంట్ లింక్ చేసినటువంటి ఈమెయిల్ అడ్రస్ ను సైతం పోలి ఉండేలా కేవలం అక్షరాల తేడాతో ఈ మెయిల్స్ ని క్రియేట్ చేసేవాడట. ఆ తర్వాత మెయిల్ అడ్రస్సులు చిన్న పొరపాటు ఉందని అప్డేట్ చేయాలని కోరుతూ .. స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో పాత లెటర్ హెడ్ పైన బ్యాంకులకు లేఖ రాసే వారట. దీంతో తనకు నచ్చిన మెయిల్ ని ఇస్తూ ఓటీపీ లావాదేవీలు అన్నిటికీ కూడా తన మెయిల్ కి వచ్చే ద్వారా ప్లాన్ చేసుకున్నారట. ఇలా వచ్చిన డబ్బుతో హర్షల్ 1.2 కోట్ల రూపాయలు విలువైన బిఎండబ్ల్యూ కారు తో పాటు.. మరో రెండు ఖరీదైన బైకులు కార్లు కొనడమే కాకుండా.. తన లవర్ కి ఒక ఫ్లాట్ వజ్రాలు పొదిగిన కళ్ళజోడిని కూడా ఆర్డర్ చేయడంతో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు చేస్తూ ఉండడంతో నిందితుడు పరారీలో ఉన్నారట. ఇక ఉద్యోగికి సహాయం చేసినటువంటి వారందరినీ కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే లావాదేవీలను పెద్ద మొత్తంలో తేడా వస్తూ ఉండడంతో అధికారి గుర్తించి ఈ విషయం వెలుగులోకి తీసేలా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: