వైరల్: టైరు బాంబులా పేలడంతో తారాజువ్వలా గాల్లోకి ఎగిరిన మెకానిక్!

praveen
సాధారణంగా బస్సులు లేదా వాహనాలు టైర్లు పేలే సమయాల్లో వాహనదారులు చాలా ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అదే వాహనాలు నడిచేటపుడు పేలితే మాత్రం భారీమూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో అనేకమంది మరణిస్తారు కూడా. ఇలాంటి ఘటనలు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. అయితే టైర్ పేలినపుడు వెలువడే శక్తి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోని మీరు చూడాల్సిందే.
అవును, ఆ వీడియోలో టైర్ పేలవడం వల్ల మెకానిక్ తారాజువ్వలా ఏకంగా గాల్లోకి ఎగిరి కింద పడడం మనం గమనించవచ్చు. దాంతో అతగాడికి తీవ్రమైన గాయాలు కూడా అయినట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాగా ఈ ఘటన అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కాగా ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. జాతీయ రహదారి 66లోని కోటేశ్వర్ సమీపంలో టైరు పంక్చర్ షాపు వద్ద 19 ఏళ్ల అబ్దుల్ రజీద్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. శనివారం ఉదయం ఒక స్కూల్‌ బస్సు టైర్‌కు పంక్చర్‌ అయి ఆ షాప్ దగ్గరకు రాగా అబ్దుల్ ఆ టైర్‌కు పంక్చర్ వేసి గాలి నింపాడు. ఈ క్రమంలోనే ప్రమాదం సంభవించింది.



అలా గాలి నింపే క్రమంలో ఆ టైర్ ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో ఓ బాంబులాగా పేలడంతో అక్కడే ఉన్న మెకానిక్ అబ్దుల్‌ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి పడ్డాడు. దీంతో అబ్దుల్ తలకు బలమైన గాయమైంది. స్థానికులు వెంటనే అబ్దుల్‌ను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించగా ట్రీట్మెంట్ పొందుతున్నాడు. గత శనివారం ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు. అంతేకాకుండా వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేస్తున్నారు. చాలామంది నెటిజన్లు "వామ్మో! ఏందయ్యా ఇది? టైర్ బాంబ్ మాది పేలుండాది?" అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: