సంక్రాంతి2025: ఏపీలో కోడిపందాలు ఎన్ని వేల కోట్లో తెలుసా..?

frame సంక్రాంతి2025: ఏపీలో కోడిపందాలు ఎన్ని వేల కోట్లో తెలుసా..?

Divya
హిందువుల సైతం చాలా గ్రాండ్గా  జరుపుకొని పండుగలు సంక్రాంతి కూడా ఒకటి.. ముఖ్యంగా ఎన్నో ప్రాంతాలలో పండుగ రోజున కొన్ని పందాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో కూడా సంక్రాంతి పండుగ రోజున కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయట. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు పందాలు కూడా జరుగుతున్నాయట. ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో ఈ పండుగను చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ వేడుకలు చూడడానికి దేశ దేశాల నుంచి చాలామంది తమ సొంత ఊర్లకు వస్తూ ఉంటారు.

కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా కోడిపందాలకు ప్రసిద్ధి.. పేకాట విచ్చలవిడిగా ఆడడమే కాకుండా మద్యం ఏరులై పారుతోందని టాకు కూడా వినిపిస్తూ ఉంటుంది. మహిళలు సైతం పిండివంటలతో ఆటపాటలతో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. గత ప్రభుత్వం పేకాట, మద్యం ,పందెం కోళ్ల పైన కాస్త ఆంక్షలు విధించినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీరికి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పండుగ రోజున అక్కడ 3,000 నుంచి 5 వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరుస్తుందట.

అయితే ఈ ఆదాయంలో ఎక్కువగా మద్యం కోడిపందాలే కీలకంగా ఉన్నాయట. రాయలసీమ ప్రాంతం తప్ప మిగిలిన ప్రాంతాలలో అన్ని చోట్ల కూడా ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయట. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణ వంటి జిల్లాలలో అసలైన సంక్రాంతి కనిపిస్తోందట. ముఖ్యంగా ఇక్కడ జరిగే కోడిపందాలు కోట్లల్లో ఉంటుందట.చిరు వ్యాపారాలు కూడా లక్షల్లో లావాదేవీలు చేస్తూ ఉంటారు. అయితే ఈ కోడి పందాలు కొన్ని గ్రామాల మధ్య కొన్ని కుటుంబాల మధ్య చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి. ఏపీలో ఒక్కటే 1000చోట్ల ఈ కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయట. గోదావరి జిల్లాలోనే 500 కోట్లకు పైగా లావాదేవులు జరుగుతున్నాయట. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: