అద్దెకు అంద‌మైన భార్య‌లు.. ధ‌రెంతో తెలిస్తే ఫ్యూజులు అవుట్‌..!

Kavya Nekkanti
థాయిలాండ్.. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే దేశం. సహజసిద్ధమైన అందాలు, సాంస్కృతిక వైవిధ్యం, రుచికరమైన వంటకాలు, షాపింగ్ స్పాట్లు.. ఇవ‌న్నీ థాయిలాండ్‌ను ప్రత్యేక గమ్యస్థలంగా నిలబెట్టాయి. అలాగే ప్రపంచంలో చాలా దేశాల్లో నైట్ లైఫ్, సెక్స్ ఇండస్ట్రీ ఉన్నా, థాయిలాండ్ మాత్రం `ఓపెన్, యాక్సెసిబుల్, ఆర్గనైజ్డ్` మోడల్‌ను ఏర్పరచుకుంది. ఇక్కడి సిటీలు సూర్యాస్తమయం తర్వాత నిజంగా మళ్లీ పుట్టినట్టే కనిపిస్తాయి. పర్యాటకులు ఒకే చోట మసాజ్ పార్లర్లు, క్లబ్బులు, బార్లు, ఎంటర్టైన్మెంట్ షోలు, సెక్స్ వర్క్ అన్నింటినీ అనుభవించగలరు. అయితే ఇప్పుడు థాయిలాండ్‌లో మ‌రో కొత్త ట్రెండ్ ఊపందుకుంది.


అదే `అద్దె భార్యల` కాన్సెప్ట్. స్ప‌ష్టంగా చెప్పాలంటే అద్దెకు అంద‌మైన భార్య‌లను తెచ్చుకోవ‌డం. ఇది అధికారికంగా గుర్తింపు పొందిన వివాహం కాదు. చట్టపరమైన బంధం కూడా కాదు. కానీ, ఒక పురుషుడు ఒక మహిళను ఒక నిర్దిష్ట కాలం పాటు భార్యలా అద్దెకు తీసుకోవచ్చు. ఒప్పందం ప్రకారం ఆ మహిళ అతనికి నిజ‌మైన భార్య‌గా అన్ని ర‌కాల సేవ‌లు అందిస్తుంది. వంట చేయడం, బయటకు తోడుగా వెళ్ళడం, అతని కుటుంబ జీవితాన్ని పోలి ఉండే వాతావరణం సృష్టించడం వంటి అన్ని పనులు చేస్తుంది. ఒక‌వేళ కాల‌క్ర‌మంలో ఆ అమ్మాయిని లేదా స్త్రీని పర్యాటకుడు ఇష్టపడితే వారు వివాహం కూడా చేసుకోవచ్చు.


థాయిలాండ్‌లో పేదరికం, ఆర్థిక ఇబ్బందులు మహిళలను ఈ దిశగా నెట్టాయి. చాలామంది యువతులు బార్‌లు, నైట్‌క్లబ్‌లలో పని చేస్తూ పర్యాటకులతో పరిచయాలు ఏర్పరుచుకున్నారు. ఆ పరిచయాల ఆధారంగా అద్దె భార్యలుగా మారడం మొదలైంది. తాత్కాలిక ఫ్యామిలీ లైఫ్ అనుభవం కోరుకునే విదేశీయుల కోసం ఈ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇక‌పోతే మహిళ వయస్సు, అందం, విద్య, కాల వ్యవధి మీద అద్దె అనేది ఆధారపడి ఉంటుంది. కొంతమంది మహిళలు కొన్ని రోజులకే భార్యగా ఉంటారు. మరికొందరు నెలల తరబడి ఒప్పందం కింద ఉంటారు. అద్దె ధరలు $1,600 నుంచి $1,16,000 (సుమారు ₹1.4 లక్షల నుంచి ₹1 కోటి) వరకు ఉంటాయ‌ని తెలియ‌డంతో నెటిజ‌న్ల‌కు ఫ్యూజులు అవుట్ అవుతున్నాయి. కాగా, థాయిలాండ్‌లో కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: