Hair Cut: జుట్టు ఈ రోజుల్లో అస్సలు కట్ చేయించుకోకూడదు..!

Thota Jaya Madhuri
చాలా మంది వారం చూసుకోకుండా వాళ్లకి ఎప్పుడు వీళ్లు పడితే అప్పుడు జుట్టు కత్తిరించుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో .. జుట్టు కత్తిరించుకోవడం కేవలం సౌందర్యం కోసం మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంది అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏ రోజు పడితే ఆ రోజు జుట్టు కత్తించుకోవడం కారణంగా ఇంట్లో కలహాలు వస్తాయట. భారతీయ సంప్రదాయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్  కేవలం స్టైల్ కోసం మాత్రమే కాదు. శుభాశుభాలు దృష్టిలో ఉంచుకుని చేస్తారు.పూర్వకాలం నుంచి నేటి వరకూ అనేక సంప్రదాయాలను మన పెద్ద వాళ్లు చెప్పిన కొన్ని విషయాలను అలా అనుసరిస్తూ వస్తున్నారు.  మన తాతముత్తాల కాలం నుంచి కొన్ని పనులను ఆ నమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అలంటి నమ్మకం లో ఒక్కటే ఈ జుట్టు కత్తిరించుకోవడం . అవును జుట్టు కత్తిరించుకోవడానికి కూడా కొన్ని కండీషన్స్ ఉన్నాయి. వినడానికి సిలీగా ఉన్నా ఇదే నిజం . వారంలో ఏ రోజు జుట్టు కత్తిరించుకోవాలి? ఏ రోజు జుట్టు కత్తిరించకూడదు? ఈ రోజు తెలుసుకుందాం..!



జుట్టు కత్తిరించుకోవడానికి శుభమైన రోజులు:

*బుధవారం - చాలా శుభదాయకం : బుధుడు విద్య, బుద్ధి, వాణిజ్యానికి సంకేతం కాబట్టి బుధవారం జుట్టు కత్తిరించడం మంచిది.

*శుక్రవారం-శుక్రుడు : సౌందర్యం, ఆరోగ్యం, సంపదకు సంకేతం. జుట్టు కత్తిరించడం శుభంగా భావిస్తారు.

*శనివారం-కొందరు శని శక్తి కోసం శనివారం కూడా కత్తిరిస్తారు, కానీ చాలా మంది ఈ రోజు దూరంగా ఉంటారు. (ప్రాంతానుసారం భేదం ఉంటుంది).

జుట్టు కత్తిరించకూడని రోజులు:

*సోమవారం-ఇది చంద్రమా (మనశ్శాంతి)కు సంబంధించిన రోజు. ఈ రోజు కత్తిరిస్తే మానసిక అస్థిరత వస్తుందని అంటారు.

*మంగళవారం-మంగళ గ్రహం శక్తి, ఆరోగ్యం, రక్త సంబంధిత సమస్యలతో సంబంధం. ఈ రోజు కత్తిరించడం శుభం కాదు.

*గురువారం-గురువు/బ్రహస్పతి జ్ఞానం, ఆధ్యాత్మికతకు సంకేతం. ఈ రోజు జుట్టు కత్తిరిస్తే బుద్ధి తగ్గుతుందని నమ్మకం.

*అమావాస్య-పితృదేవతల రోజు. ఈ రోజు శరీర సంస్కరణలు  చేయకూడదు.

*పౌర్ణమి-శక్తివంతమైన రోజు కాబట్టి జుట్టు కత్తిరించడం తగ్గిస్తారు.

*పండుగల ముందు రోజు: కొందరు శుభంగా ఉంచుకోవడం కోసం పండుగకి ముందు కత్తిరిస్తారు కానీ పండుగ రోజున చేయరు.

* జన్మనక్షత్రం రోజు: మీ నక్షత్రం రోజున కత్తిరించడం మానుకుంటారు.

*సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రోజులు: ఈ రోజుల్లో కూడా జుట్టు కత్తిరించరాదు.

శాస్త్రీయంగా:

వారానికి ఒకసారి లేదా 10-15 రోజులకు ఒకసారి జుట్టు కత్తిరించడం జుట్టు ఆరోగ్యం కోసం మంచిది. శుభాశుభాల పక్కన, వృత్తిపరమైన జీవితం, పరిశుభ్రత కోసం కూడా వారానికి ఒక ఫిక్స్‌డ్ రోజు ఎంచుకోవచ్చు. హెయి స్టైల్ క్రమబద్ధంగా ఉండేందుకు క్రమం తప్పకుండా ట్రిమ్ చేసుకోవడం అవసరం అని డాక్టర్లు చెపుతుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: