సింపుల్ ఎంట్రీతో షాక్ ఇచ్చిన వధువు స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న వరుడు!
ఈ జంట మధ్య ప్రేమ ఈనాటిది కాదు. వీరిద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం స్కూల్ డేస్‌లోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. చదువు పూర్తయిన తర్వాత కూడా వీరి బంధం విడిపోలేదు. ఉద్యోగ రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌ను మెయింటెన్ చేస్తూ చివరకు పెళ్లి పీటల వరకు చేరారు. తమ ప్రేమకు పునాది పడిన ఆ స్కూల్ జ్ఞాపకాలను పెళ్లి రోజున గుర్తు చేసుకోవాలని ఆ వధువు ఈ నిర్ణయం తీసుకుంది.
పెళ్లి బట్టల్లో తన భార్యను చూడాలని ఎదురుచూస్తున్న వరుడికి, స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆమెను చూడగానే ఒక్కసారిగా పాత జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు కదలాడాయి.వరుడు స్టేజ్ మీద ఉండగా, వెనుక నుంచి వచ్చిన వధువు మెల్లగా అతడి భుజంపై తట్టింది. అతను వెనక్కి తిరిగి చూడగానే, 11 ఏళ్ల క్రితం తాను ప్రేమించిన ఆ 'స్కూల్ గర్ల్' ఎదురుగా నిలబడి ఉండటంతో అతను ఎమోషనల్ అయ్యాడు.తన భార్య చేసిన ఈ స్వీట్ సర్‌ప్రైజ్‌కి అతను ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ, ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఈ దృశ్యం చూసిన అతిథులందరి కళ్లు చెమర్చాయి.
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు."ఇది కదా అసలైన ప్రేమంటే!" అంటూ కొందరు.."స్కూల్ యూనిఫాం అంటే కేవలం బట్టలు కాదు.. అది ఒక ఎమోషన్!" అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.ముఖ్యంగా ఈ కాలంలో చిన్న చిన్న కారణాలకే విడిపోతున్న జంటలకు, 11 ఏళ్ల పాటు తమ ప్రేమను కాపాడుకుని ఇలా అందంగా ఒక్కటైన ఈ జంట ఒక ఇన్‌స్పిరేషన్ అని నెటిజన్లు కొనియాడుతున్నారు.
లక్షల రూపాయలు పెట్టి కొనే వెడ్డింగ్ డ్రెస్ కంటే, తమ ప్రేమ మొదలైన రోజులను గుర్తు చేసే ఆ పాత యూనిఫాం ఆమెకు ఎంతో విలువైనదని ఆ వధువు నిరూపించింది. ఖరీదైన వేడుకల కంటే పవిత్రమైన జ్ఞాపకాలే పెళ్లికి అసలైన అందం అని ఈ వీడియో ద్వారా అర్థమవుతోంది.పెళ్లి అంటే కేవలం రెండు కుటుంబాల కలయిక మాత్రమే కాదు, రెండు హృదయాల జ్ఞాపకాల సమాహారం. ఈ చైనా వధువు చేసిన ఈ చిన్న ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికుల మనసు గెలుచుకుంది.