పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్.. మ్యాట్రిమోనీకి గుడ్‌బై, హైపర్ మ్యాచ్‌మేకింగ్‌కు వెల్కమ్!
సైకోమెట్రిక్ టెస్టులు. . . ఎమోషనల్ ఇంటెలిజెన్స్ :
కొన్ని ప్రీమియం ప్లాట్ఫారమ్లైతే ఏడాదికి ఏకంగా రూ. 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. వీరు కేవలం ప్రొఫైల్స్ చూపడమే కాకుండా, అభ్యర్థులకు వ్యక్తిగత కోచ్‌లను కూడా కేటాయిస్తున్నారు. పెళ్లి చూపుల్లో తిరస్కరణలు ఎదురైనప్పుడు కలిగే మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో ఈ కోచ్‌లు నేర్పిస్తున్నారు. దీంతో పెళ్లి అనేది కేవలం ఒక ఒప్పందంలా కాకుండా, బలమైన మానసిక బంధంగా మారుతోంది . గతంలో మ్యాట్రిమోనీ అకౌంట్లను తల్లిదండ్రులు నిర్వహిస్తే, ఇప్పుడు 77 శాతం ప్రొఫైల్స్ యువతే స్వయంగా మేనేజ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రమేయం క్రమంగా తగ్గుతూ, తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకునే స్వేచ్ఛ పెరుగుతోంది.
పర్సనల్ కోచ్‌ల ‘రాంపేజ్’!
కేవలం ఆన్లైన్ చాటింగ్‌లకే పరిమితం కాకుండా, ఇప్పుడు ఆఫ్‌లైన్ మిక్సర్స్ కు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది . . ఒకే అభిరుచులు ఉన్న వ్యక్తులు డిన్నర్లు లేదా ప్రత్యేక ఈవెంట్లలో కలుసుకుని నేరుగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ డ్రింకింగ్, స్మోకింగ్ వంటి అలవాట్లను దాచకుండా నిజాయితీగా వెల్లడించే వాతావరణం ఇక్కడ ఉండటం గమనార్హం. దాపరికం లేని బంధాల కోసం యువత తహతహలాడుతోంది.మొత్తంమీద భారతీయ వివాహ వ్యవస్థలో ఇప్పుడు డిజిటల్ డేటింగ్ కంటే ఇంటెన్షనల్ మ్యాచింగ్ కే పెద్దపీట వేస్తున్నారు . .